న్యూస్‌రీల్
వ్యర్థం.. కాలువలకు అనర్థం
భీమవరం పట్టణంలో పంట కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాలతో నిండిపోతున్నాయి. అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. 8లో u
తల్లిదండ్రులని కూడా చూడకుండా వృద్ధ దంపతులపై కుమారుడు, మనుమలు దాడికి తెగబడ్డారు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. 8లో u
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచి వేల కోట్ల అదనపు భారం ప్రజలపై వేయడమేనా ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడ్డారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ సోమవారం జిల్లావ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, మానవహారాలు నిర్వహించారు. డీజిల్, పెట్రోల్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా వ్యాట్‌ను తగ్గించకుండా ఇది తమ పరిధిలోని అంశం కాదంటూ చేతులు దులుపుకునేలా మాట్లాడటంపై ధ్వజమెత్తారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు. అలాగే ఏలూరులో కలెక్టర్ కె.వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు.
● కై కలూరులో..
కై కలూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి తాలూకా సెంటరుకు చేరుకుని అక్కడ కొద్దిసేపు ఆందోళన నిర్వహించి అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ.3,391 కోట్ల భారాన్ని మోపిందని, కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యాట్ సెస్‌ను మినహాయించి భారం పడకుండా చూడాల్సి ఉన్నా సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
● ఉంగుటూరులో..
ఉంగుటూరులో నియోజకవర్గ సమస్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని పదేపదే చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పి ధరలు పెంచి సామాన్యులని ఇక్కట్లు పాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ధరలను అదుపు చేయా ల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
● ఏలూరులో..
ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేశారు. గ్యాస్ సిలిండర్లతో వినూత్న నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు. నాకు విజన్ ఉంది.. జాతీయ నాయకుడిని అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఒకేసారి ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపాడని, డీజిల్, పెట్రోల్ ప్రభావం అన్ని రంగాలపై పడి నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయని జయప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రకటించి దానిని పట్టించుకోకపోగా నానాటికీ పెంచి ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తున్నారని మండిపడ్డారు.
● చింతలపూడిలో..
చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో చింతలపూడిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ధర్నా చేశారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. విజయరాజు మాట్లాడుతూ దేశాల్లో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయని, ప్రజలపై మోయలేని భారాన్ని మోపారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో పేదల జీవితాలు ఇబ్బందికరంగా మారుతున్నాయన్నారు. తక్షణమే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మంత్రి లోకేష్ పెట్రోల్ బంకుల వద్ద ధరల బోర్డుల వద్ద సెల్ఫీలు దిగి హంగామా చేశాడని, ఇప్పుడు పెరిగిన రేట్లపై ఏం మాట్లాడతారని ప్రశ్నించారు.
● పోలవరంలో..
పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో నిరసన కార్యక్రమం పోలవరం నియోజకవర్గ పరిశీలకుడు మంతెన శివరామరాజు ఆధ్వర్యంలో చేపట్టారు. కనకదుర్గమ్మ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. శివరామరాజు మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేసేలా చంద్రబాబు పాలన జరుగుతుందని, ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
పెట్రో మంటపై వైఎస్సార్‌సీపీ నిరసనాగ్రహం
జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు
కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాల అందజేత
కై కలూరులో జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో భారీ ర్యాలీలు


