లక్ష మల్లెల అర్చన | - | Sakshi
Sakshi News home page

లక్ష మల్లెల అర్చన

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

లక్ష మల్లెల అర్చన

ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న ముదినేపల్లి మండలం శింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో జ్యేష్ట మాసం సందర్భంగా లక్ష మల్లెల అర్చన సోమవారం జరిగింది. ప్రధాన అర్చకుడు తోలేటి వీరభద్రశర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఏటా లక్ష మల్లెల అర్చన ఇక్కడి ఆనవాయితీ. ఆలయ చైర్మన్‌ బొంగు రవికుమార్‌, సహాయ కమిషనర్‌, ఈఓ ఆర్‌.గంగాశ్రీదేవి, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

– ముదినేపల్లి (కై కలూరు)

Advertisement
 
Advertisement
Advertisement