సాగులో సమతుల్యత అవసరం | - | Sakshi
Sakshi News home page

సాగులో సమతుల్యత అవసరం

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

సాగులో సమతుల్యత అవసరం

తాడేపల్లిగూడెం: సాగులో సమతుల్యత ఎరువుల వినియోగం ఖరీప్‌ 2026కు సంబంధించి ఐసీఏఆర్‌ అటారి జోన్‌ పరిధిలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యానవర్సిటీ, కృషి విజ్ఞానకేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమీకృత వ్యవసాయ పద్ధతులు సమర్థవంతమైన విధానమని కేవీకే సైంటిస్టు ఏ.దేవీవరప్రసాదరెడ్డి అన్నారు. ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా అనుబంధ కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడం వల్ల లాభాలుంటాయన్నారు. ఈ వ్యవసాయంలో భాగంగా చేపల పెంపకం, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి వాటిని అనుసంధానం చేసుకోవాలన్నారు. రైతులు బహుళ ఆదాయాలు పొందడానికి ఇది ఒక మార్గమన్నారు. చేపల చెరువుల్లోని నీటిని పంటలకు ఉపయోగించడం, పశువుల నుంచి లభించే పేడను సేంద్రియ ఎరువుగా వాడటం, కోళ్ల పెంపకం ద్వారా గుడ్లు, మాంసం నుంచి అధిక ఆదాయం పొందవచ్చన్నారు. మత్స్య విభాగంలో చేపల పట్టుబడి, వలల వినియోగంపై అవగాహన కల్పించారు. దీంతో పాటు ఎరువుల వినియోగంపై విశదీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement