కైకలూరు: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కైకలూరులో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆదివారం తెలిపారు. ఉదయం 9 గంటలకు నియోజకవర్గ నాలుగు మండలాల నుంచి నాయకులు ఏలూరు రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ నుంచి కై కలూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందిస్తామని చెప్పారు.
ఏలూరు (టూటౌన్) : రాష్ట్రంలో విశ్రాంత ఉ ద్యోగులకు పెండింగ్ డీఏ ఏరియర్స్‌ను త క్షణమే చెల్లించాలని జిల్లా రాష్ట్ర ప్రభుత్వ వి శ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.ఆంజనేయులు, కె.మహాలక్ష్ముడు కోరారు. ఆదివారం స్థానిక కోటదిబ్బలోని సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 30న జరుగునున్న జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో విశ్రాంత ఉద్యోగులు పాల్గొనాలని కో రారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జిల్లా కోశాధికారి డి.గంగాధర్ రావు, జిల్లా నాయకులు, ఏఐటీయూసీ నాయకులు ఎ.అప్పలరాజు మాట్లాడారు.
దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించారు. ఆలయ ఆవరణలో ముడుపుల మొక్కులు కట్టారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పెనుమంట్ర: మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం నుంచి ఎంటీయూ 1318 ఫౌండేషన్ వరి విత్తనాల అమ్మకాలు ప్రారంభిస్తున్నట్టు పరిశోధన సంచాలకుడు డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. కిలో విత్తనాలు రూ.42 చొప్పున 20 కిలోల బస్తా రూ.1,050 చొప్పున విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. రైతులు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మ ధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని కోరారు.
కాకినాడ బోట్‌క్లబ్: కాకినాడ గాంధీభవన్‌లో ఆదివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యాన కోగంటి విజయ్ రాసిన ‘ఎవరిదీ చూపు’ కవితా సంపుటి ఆవిష్కరణ, సమీక్ష సభ జరిగింది. ఈ పుస్తకాన్ని కవిసంధ్య పత్రిక సంపాదకుడు శిఖామణి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన జోస్యుల కృష్ణబాబు మాట్లాడుతూ గ్రంథకర్త కోగంటి విజయ్ కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ, సాహిత్యంపై మక్కువతో అనేక గ్రంథాలు వెలువరించారని అన్నారు. ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి మాట్లాడుతూ స్ఫూర్తిదాయకమైన కవిత్వం విజయ్ కవిత్వం అన్నారు. వక్త కాళ్లకూరి శైలజ మాట్లాడుతూ కోగంటి విజయ్ కవిత్వం ఎటువంటి సంక్లిష్టతకు తావులేకుండా అర్థమయ్యేలా ఉందన్నారు. సంపుటి లో సుమారు 70 కవితలు ఉన్నాయన్నారు. అనంతరం కవి సమ్మేళనం జరిగింది.


