ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నం దారుణం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నం దారుణం

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నం దారుణమని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్‌ డాంగే అన్నారు. ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏలూరు డిపో వద్ద రెండో రోజు ఆదివారం ఆర్టీసీ కార్మికులు ధ ర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ ఏలూరు రీజినల్‌ కోశాధికారి జి.భాస్కర్‌ మాట్లాడుతూ ఎలక్ట్రికల్‌ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసి, ఆర్టీసీయే నడపాలని డిమాండ్‌ చేశారు. ఆ ర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానే కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కోరారు. సీ్త్రశక్తి పథకం వల్ల ఉద్యోగ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కా రానికి ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు డిపో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement