ఫెన్సింగ్‌ సెలెక్షన్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఫెన్సింగ్‌ సెలెక్షన్స్‌

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

ఫెన్సింగ్‌ సెలెక్షన్స్‌

తణుకు అర్బన్‌: జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు 24 మంది క్రీడాకారులు ఎంపికై నట్టు ఏపీ ఫెన్సింగ్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జీఎస్‌వీ కృష్ణమోహన్‌ తెలిపారు. ఏపీ స్టేట్‌ క్యాడెట్‌ బాయ్స్‌ అండ్‌ గరల్స్‌ (అండర్‌ 17) ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2026–27, 21వ నేషనల్‌ క్యాడెట్‌ ఫెన్సింగ్‌ ఏపీ స్టేట్‌ టీమ్‌ సెలెక్షన్స్‌ స్థానిక ఆకుల శ్రీరాముల ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు హా జరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23న ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ క్యాడెట్‌ ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. కళాశాల అధినేత ఆకు ల విష్ణువర్థన్‌, ఏపీ ప్రైవేట్‌ ఐటీఐ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు బసవ రామకృష్ణ పోటీలను ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement