పవనూ.. ఇది తగునా! | - | Sakshi
Sakshi News home page

పవనూ.. ఇది తగునా!

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

సాక్షి, భీమవరం: ‘నేనేమీ సీఎం కావాలని పార్టీ పెట్టలేదు’ అంటూ జనసేనఽ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాఫిక్‌గా మారాయి. ఎన్నికల సభల్లో సీఎం.. సీఎం.. అని పిలిపించుకుంది ఎందుకన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తమ అభిమాన నేతను ముఖ్యమంత్రిగా చూడాలన్న కేడర్‌ ఆశలపై ఆయన మాటలు నీళ్లు చల్లినట్లయ్యింది. తమిళనాడులో సినీ హీరో విజయ్‌ పార్టీని స్థాపించిన రెండేళ్లకే ముఖ్యమంత్రిగా ఎన్నికై న విషయం తెలిసిందే. ఇతర పార్టీలతో పొత్తు పెట్టు కోకుండా ఒంటరిగా పోటీచేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే.. జనసేన పార్టీ పెట్టి పుష్కర కాలమైనా ఇంకా పొత్తుల కోసం పాకులాటపై ఇంటా బయట తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయమై శుక్రవారం మంగళగిరిలో పార్టీ నా యకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ‘నేనే మీ సీఎం కావాలని పార్టీ పెట్టలేదు’ అన్న పవన్‌కల్యాణ్‌ మాటలు కేడర్‌ను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. గతంలోని ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కు వెళ్లినా అభిమానులతో సీఎం.. సీఎం.. అని పిలి పించుకున్న పవన్‌ ఇప్పుడు అందుకు భిన్నంగా మా ట్లాడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో వామపక్షాలతో జతకట్టిన పవన్‌ తాను వామపక్షవాదిని కాదని చెప్పడం చర్చకు దారితీస్తోంది.

మొదట్లో విమర్శలు

టీడీపీ, వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా జనసేన పార్టీ స్థాపించినట్లు మొదట్లో పవన్‌కల్యాణ్‌ చెప్పుకొచ్చా రు. చంద్రబాబు పోలవరం, అమరావతిలో రాజ ధాని పేరుతో సొంత సామాజికవర్గానికే దోచి పెడుతున్నాడని ఆరోపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని వేల ఎకరాలు అవసరం లేదంటూ ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలు, పిడికెడు మట్టి ఇచ్చారంటూ భారతీయ జనతా పార్టీపై ఽసైతం విమర్శలు గుప్పించారు.

కూటమిలో రచ్చకెక్కిన విభేదాలు

తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య వైరం ఇప్పటికే రచ్చకెక్కింది. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకులలో తమకు తగిన ప్రాధాన్యం లేదన్న నిరాశలో పార్టీ శ్రేణులు చాలా వరకు సైలెంటైపోయారు. పార్టీ కోసం జిల్లాలో కీలకంగా పనిచేసిన నేతలకు ప్రభుత్వంలో తగిన స్థానం దక్కలేదన్న అసంతృప్తి ఉంది. పవన్‌ సీఎం అయితే తమకు తగిన ప్రా తినిధ్యం లభిస్తుందని ఎదురుచూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. గతంలో లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేస్తారని ప్రచారం జరిగిన సందర్భంలో ప్ర భుత్వంలో పవన్‌కు ప్రాధాన్యత తగ్గుతుందని కేడర్‌ ఆందోళన చెందారు. సోషల్‌ మీడియా వేదికగా తమ గళం వినిపించారు. అప్పట్లో సోషల్‌ మీడి యాలో టీడీపీ, జనసేనలు పోటాపోటీగా పోస్టులు సైతం పెట్టుకున్నారు. ప్రభుత్వంలో తర్వాతి స్థానంలో ఉన్న పవన్‌ సీఎం అవుతారని ఎదురుచూస్తున్నారు. కాగా సీఎం కావాలని పార్టీ పెట్టలేదన్న పవన్‌ వ్యాఖ్యలు ఆయన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మాటలు దేనికి సంకేతమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ పెట్టింది సీఎం అయ్యేందుకు కాదా!

సభల్లో సీఎం.. సీఎం.. అని పిలిపించుకుంది ఎందుకు ?

పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై జనసేన కేడర్‌లో నిర్వేదం

కడదాకా టీడీపీకి కొమ్ము కాయాల్సిందేనా..?

అసంతృప్తితో రగలిపోతున్న నేతలు

Advertisement
 
Advertisement
Advertisement