ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీ ద్వారానే ని ర్వహించాలని, పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి, సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం ఏలూరు ఆర్టీసీ గ్యారేజీ వద్ద ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘ ఏలూరు డిపో కార్యదర్శి డి.ఆంజనేయులు, రీజియన్ కార్యదర్శి బి.రాంబాబు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ నడపాలని, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సుల స్థానే కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కోరారు. సీ్త్రశక్తి పథకం వల్ల ఉద్యోగ, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని, 11వ పీఆర్‌సీ బకాయిలు, పెండింగ్ డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పలు పలు సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు డిపో గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, రీజనల్ కోశాధికారి జి.భాస్కర్, డిపో ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.శ్రీహరి, ఎస్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.


