మహిళ మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లి హైవేపై చోటుచేసుకుంది. 8లో u
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం వేసవి ఏర్పాట్లు చేసినట్టు దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్‌లాల్ తెలిపారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం ఆయన సతీసమేతంగా సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు ఆయన వడజావ వితరణను ప్రారంభించారు. ఇటీవల ప్రారంభించిన శాశ్వత క్యూ కాంప్లెక్స్, అనివెట్టి మండపం ఫేజ్–2, శివాలయం ఐదు అంతస్తుల రాజగోపురాన్ని పరిశీలించారు. నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదం నాణ్యత, రుచిపై భక్తులను ఆరా తీశారు. క్షేత్రంలో పలు విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. క్షేత్ర అభివృద్ధి, సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా భక్తులకు వడజావను వచ్చే నెలాఖరు వరకు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం ఆలయ అధికారులతో సమీక్షించారు. ఈఓ వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్, డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు.


