న్యూస్‌రీల్
తెల్లవారుజామున షాక్
రోజుకు రూ. 18.75 లక్షల భారం
జీడి.. మద్దతు కొరవడి
ఈ ఏడాది ప్రభుత్వం జీడిమామిడి పంటకు గిటుబాటు ధర కల్పించకపోవడంతో దళారులు చేతుల్లో గిరిజన రైతులు మోసపోతున్నారు. 8లో u
శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026
పశ్చిమాసియా కల్లోలంతో చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్యుడికి మళ్లీ కష్టాలు తప్పడం లేదు. సాధారణ, మధ్య తరగతి ప్రజల నెలవారీ ఖర్చులపై పెట్రోభారం భారీగానే ఉండనుంది. ఇప్పటికే గ్యాస్ ధరలకు రెక్కలు రాగా శుక్రవారం నుంచి పెట్రోల్‌పై లీటరుకు రూ.3.29, డీజిల్‌కు రూ.3.14 చొప్పున పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్ రూ.113.12కు, డీజిల్ రూ.100.78 చేరాయి. ఈ మేరకు జిల్లాలోని వినియోగదారులపై రోజుకు రూ. 18.75 లక్షల అదనపు భారం పడుతుందని అంచనా.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నెలల తరబడి సాగుతున్న అమెరికా– ఇరానన్ యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చి రెండో వారంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. డొమెస్టిక్ సిలెండర్ రూ.892 నుంచి రూ.952కు, వాణిజ్య సిలెండర్ రూ.1850.50 నుంచి రూ. 2177కు పెరిగాయి. రెండు నెలలు తిరగకుండానే వాణిజ్య సిలెండర్ ధరను రూ.3,170కు పెంచింది.
సామాన్యులకు సెగ : మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కంది, మినుము, పెసరపప్పులు నాణ్యత రకాన్ని బట్టి కిలో రూ.125 నుంచి రూ.135 వరకు ఉన్నాయి. పామాయిల్ ప్యాకెట్ రూ.140 వరకు ఉండగా, సన్‌ఫ్లవర్, వేరుశనగ, బ్రాన్ ఇతర ఆయిల్ ధరలు రూ.150 నుంచి రూ.200 పైగా పలుకుతున్నాయి. నిత్యావసర సరుకులు లేనిదే రోజు గడవక సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. ఇప్పటికే గ్యాస్ ధరల పెంపుతో వారిపై అదనపు భారం పడింది. కమర్షియల్ సిలెండర్లు ధర భారీగా పెంచడంతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్ షాపులు, కర్రీ పాయింట్లలో ధరలకు రెక్కలొచ్చాయి. టిఫిన్, మీల్స్‌పై ప్లేటుకు రూ.5 నుంచి రూ.20 వరకు ధరలు పెంచేశారు. మిగిలిన ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతో రవాణా భారం కానుంది. సరుకుల రవాణా చార్జీలు పెరిగి కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
శుక్రవారం ఉదయం పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిన వినియోగదారులకు బంకుల్లో పెరిగిన ధరలు షాకిచ్చాయి. ధరలు పెరిగిన విషయం తెలియక పెట్రోల్ కొట్టించుకున్న వినియోగదారులకు లీటర్‌పై రూ. 3 పెరిగిందని చెబితే గానీ తెలియలేదు. దీనితో కొందరు వినియోగదారులకు, బంకులో కార్మికులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. కేంద్రం పెట్రోధరలు మూడు రూపాయలే పెంచినా స్థానిక పన్నుల రూపంలో మరో రూపాయి వరకూ అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏలూరు జిల్లాలో వివిధ ఆయిల్ సంస్థలకు చెందిన 260 పెట్రోల్ బంకులున్నాయి. వీటి ద్వారా రోజూ జిల్లా ప్రజలు మొత్తం 6.25 లక్షల లీటర్లను వినియోగిస్తున్నారు. దీనిలో 3.65 లక్షల డీజిల్, రూ. 2.60 లక్షల పెట్రోల్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు పెరిగిన మూడు రూపాయల చొప్పున జిల్లా ప్రజలపై రోజుకు రూ.18.75 లక్షల అదనపు భారం పడుతోంది. అంటే సుమారు రెండు రోజులకు ఒక లీటర్ పెట్రోల్ వినియోగించే వినియోగదారుడిపై ఏడాదికి సుమారు రూ.1000 అదనపు భారం పడుతోంది. చూడడానికి ఈ మొత్తం చిన్నగానే కనిపిస్తున్నా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మాత్రం విపరీతమైన భారమనే చెప్పాలి.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడికి కష్టాలు
జిల్లాపై రోజుకు రూ.18.75 లక్షల భారం
జిల్లాలో రోజుకు 6.25 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం


