కూటమి నేత దర్జాగా కబ్జా | - | Sakshi
Sakshi News home page

కూటమి నేత దర్జాగా కబ్జా

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

కూటమి నేత దర్జాగా కబ్జా

తాడేపల్లిగూడెం: జాగా కనిపిస్తే దర్జాగా కబ్జా చేసేయ్‌ అన్న రీతిలో నియోజకవర్గంలోని కూటమి నేత వ్యవహార శైలి ఉంది. ఈ నేత తాజాగా పట్టణంలోని రెండో టౌన్‌లో బాలవెంకటేశ్వరస్వామి భూమిని ఆక్రమించిన నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ నేత అక్రమాలకు అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చెక్‌ పెట్టారు. ఆక్రమణలు తొలగించి భూమిని దేవదాయ శాఖకు బదలాయించారు. కూటమి పాలన వచ్చాక సదరు నేత మళ్లీ అక్రమ నిర్మాణాలు చేశారు. కట్టడి చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా బోర్డు ఏర్పాటుచేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ నేత ఉంటున్న ఇల్లు కూడా దేవదాయ శాఖకు చెందిన భూమిలో ఉందని కేసు నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement