ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శిగా గొల్ల కిరణ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శిగా గొల్ల కిరణ్‌

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శిగా గొల్ల కిరణ్‌ ఈఏపీసెట్‌కు 787 మంది హాజరు ఇంధన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలి ప్రభుత్వ బడుల్లో 5,965 మంది చేరిక అరకమంగా మట్టి తవ్వకాలు

దెందులూరు: వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శిగా గొల్ల కిరణ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తెలిపారు.

సోషల్‌ మీడియా వింగ్‌ కార్యదర్శిగా రియాజ్‌ షరీఫ్‌

పోలవరం రూరల్‌: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో పోలవరానికి చెందిన షేక్‌ రియాజ్‌ షరీఫ్‌కు స్థానం దక్కింది. పార్టీ కేంద్ర కార్యాలయం రాష్ట్ర సోషల్‌ మీడియా వింగ్‌ కార్యదర్శిగా షేక్‌ రియాజ్‌ షరీఫ్‌ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రియాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్షలు శుక్రవారం నగరంలో ప్రశాంతంగా జరిగాయి. ఏలూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం షిప్టుల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 787 మంది హాజరయ్యారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో మధ్యాహ్నం షిప్ట్‌నకు 120 మందికి గాను 116 మంది హాజరు కాగా ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 170 మందికి 163 మంది, మధ్యాహ్నం 170 మందికి 161 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 180 మందికి 176 మంది హాజరు కాగా మధ్యాహ్నం 180 మందికి 171 మంది హాజరయ్యారు.

ఏలూరు (టూటౌన్‌): యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇందన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌కు ఎలాంటి కొరతా లేదని, సోషల్‌ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దన్నారు. రబీ ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి 50 శాతం బకాయిలను చెల్లించిందని చెప్పారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 5,965 మంది బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించామని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌కు తెలిపారు. బడి పిలుస్తోంది, ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ పై కలెక్టర్లతో విద్యా శాఖ కార్యదర్శి శనివారం జూమ్‌ కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కోన శశిధర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీలలో ప్రీ స్కూల్‌లో ఉన్న పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని, బడి మానివేసిన వారిని తిరిగి బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడీలలో ప్రీ స్కూల్‌ చదువుతున్న వారిలో 11,200 మంది పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు లక్ష్యం కాగా, ఇంతవరకు 5,965 మందిని బడులలో చేర్పించామని, మిగిలిన వారిని కూడా త్వరలో ప్రభుత్వ బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం పంచారామ క్షేత్రానికి చెందిన గునుపూడి టిడ్కో ఇళ్ల సమీపంలోని వ్యవసాయ భూమిలో కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తుండగా భక్తులు గమనించి పంచారామ క్షేత్ర అధికారులకు తెలియజేశారు. శుక్రవారం ఆలయ ఈఓ కృష్ణంరాజు, ఆలయ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. వారి ఫిర్యాదుతో రెవెన్యూ, పోలీస్‌ శాఖా ధికారులు మట్టి తవ్వుతున్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. అనుమతులు లేకుండా దేవస్థానం భూమిలో మట్టి తవ్వకాలకు సిద్ధపడడంపై అటు భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement