పేకాడుతున్న 9 మంది అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పేకాడుతున్న 9 మంది అరెస్టు

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

డంపింగ్‌ యార్డు ఫిర్యాదుపై విచారణ

మండవల్లి: మండలంలోని దెయ్యంపాడులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై శుక్రవారం ఎస్సై రామచంద్రరావు తన సిబ్బందితో దాడి చేశారు. ముందస్తు సమాచారం మేరకు చేసిన దాడిలో పేకాడుతున్న 9 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.49 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 9 సెల్‌ ఫోన్లు సీజ్‌ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

పాలకొల్లు సెంట్రల్‌: పట్టణంలో యడ్లబ బజారు, రామయ్యహాలు ప్రాంతాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లో పొగ వస్తుందని ఫిర్యాదులు రావడంతో ఏలూరు పర్యావరణ శాఖ ఇంజనీర్‌ రామచంద్రమూర్తి విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి డంపింగ్‌ యార్డు తనిఖీ చేసి, మునిసిపల్‌ అధికారులకు నోటీసులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement