జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయ పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ఊహించిన విధంగా రాజాన సత్యనారాయణ (పండు) ఆలయ చైర్మన్ కానున్నారు. ఆయనతో పాటు 11 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. రాజాన సత్యనారాయణ, ఓబిలినేని సూర్యభవానీ, చింతపల్లి రత్నసురేష్, ధూళిపాళ సూర్యచంద్ర వెంకట ప్రభాకరరావు, వల్లూరి సునీత, జగన్నాధం వెంకటమ్మ, తిరుమలశెట్టి నాగ వరలక్ష్మి అనీల, దూనబోయిన నారాయణమూర్తి, గెడ దుర్గా హరి సాగర్ చందు, నడిపల్లి విద్యాసాగర్, ఆరుగోల్లు సావిత్రిలు ఉన్నారు. ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఎక్స్ అఫీషియో మెంబర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఎన్నికై న 11 మంది సభ్యుల్లో రాజాన పండును సభ్యులు ఛైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. నియమితులైన సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు.
ఏలూరు టౌన్: నగరంలో ట్రాఫిక్ నియంత్రణంలో భాగంగా నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించామని ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఏలూరు పోలీస్ డార్మిటరీలో ఇటుకబట్టీల ట్రాక్టర్ డ్రైవర్లతో ట్రాఫిక్ సీఐ ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ట్రాక్టర్లు, లారీలు, ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించామని స్పష్టం చేశారు. ఈ సమయంలో డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఇష్టారాజ్యంగా నగరంలోకి ప్రవేశించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్‌కు చేర్చేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమనీ, ట్రాక్టర్ డ్రైవర్లు ముఖ్యంగా పరిమిత వేగంతోనే ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.


