పాలకవర్గ సమావేశం నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పాలకవర్గ సమావేశం నిర్వహించాలి

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

పాలకవర్గ సమావేశం నిర్వహించాలి నిర్లక్ష్యం తగదు ●

ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రెండున్న సంవత్సరాలుగా జరగకపోవడం బాధాకరం. కూటమి ప్రభుత్వం గిరిజన సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసింది. అనేక సమస్యలతో గిరిజన గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

– తెల్లం బాలరాజు, పోలవరం మాజీ ఎమ్మెల్యే

గ్రామ స్థాయిలో గిరిజనులు ఎదుర్కొనే అన్ని సమస్యలను సభ్యులందరూ ఐటీడీఏ పాలకవర్గం దృష్టికి తీసుకువస్తారు. రెండున్నరేళ్లుగా సమావేశం జరగకపోవడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వ పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలి

– సరియం రామ్మోహన్‌రావు, ఏఐటీఎఫ్‌ జాతీయ కన్వీనర్‌, బుట్టాయగూడెం

Advertisement
 
Advertisement
Advertisement