న్యూస్‌రీల్
వేసవి తాపం.. చేపకు శాపం
ఆక్వా రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో చెరువుల్లో చేపలను రక్షించేందుకు ఆక్వా రైతులు నానా పాట్లు పడుతున్నారు. 8లో u
శురకవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026
కై కలూరు: ఆర్థికాభివృద్ధిలో కీలకమైన ఆక్వారంగం కుదేలవుతోంది. చంద్రబాబు పాలనలో చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదు. రెండేళ్ల కాలంలో మేతల ధరలు పెంపు రొయ్యల రైతులకు శాపంగా మారుతోంది. తాజాగా మరో మారు ధరల పెంపు సూచనలతో రైతులు విలవిల్లాడుతోన్నారు. శుక్రవారం అధికారులు, రైతులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో జరిగే సమావేశంలో మేత ధరలపై నిర్ణయం ఎలా ఉంటుందనే అంశం రాష్ట్రంలో ఆక్వా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరో పక్క ఇదే సాకుగా రొయ్యల ధరలను దళారులు తగ్గించేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇందులో చేపలు 1.80 లక్షల ఎకరాలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. దాదాపు 80 వేల మంది ఆక్వా రైతులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏటా రాష్ట్రంలో 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తుల్లో సింహభాగం ఉమ్మడి జిల్లాల నుంచి ఎగుమతులు అవుతున్నాయి. లీజు ధరలను బట్టి వనామీ రొయ్యలు టన్ను ఉత్పత్తికి రూ.2.60 లక్షలు. ఇదే టైగర్ రొయ్యలకు టన్నుకు రూ.3.50 లక్షలు పెట్టుబడి అవుతోంది. ఇప్పటికే రొయ్యలసాగులో వైరస్‌ల వల్ల నష్టం అధికంగా ఉంది. ఇప్పుడు కంపెనీలు మేతల ధరలను పెంచితే సాగు చేయలేమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.
హామీలు మరిచిన ప్రభుత్వం
ఉమ్మడి మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆక్వారంగానికి వరాలు ప్రకటించారు. అవసరమున్న జిల్లాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీలు, అన్ని జోన్లలో ఉన్నవారికి విద్యుత్ యూనిట్‌కు రూ.1.50కే సరఫరా, విద్యుత్ ట్రాన్మ్‌ఫార్మర్ల ధరలు తగ్గింపు, సబ్సిడీపై రొయ్యల సాగు, ఏరియేటర్ల పంపిణీ అని గొప్పగా చెప్పారు. ఆక్వా రైతులు కూడా ఆనందించారు. ఇవి అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. గత ప్రభుత్వంలో రైతులకు మినహాయించి కూటమి పాలనలో 1.50 యూనిట్ అమలు జరగడం లేదు. కోల్డ్ స్టోరేజీల మాటే మరిచారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్సిడీ ఏరియేటర్లు కలగా మారాయి. కరోనా సమయంలో సైతం ఆక్వా రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పించి, ఈ రంగంపై ప్రేమను చాటుకుంది.
ధరల నియంత్రణ ఏది
కూటమి పాలనలో ఆక్వా ఉత్పత్తుల ధరల నియంత్రణ గాలిలో దీపంగా మారింది. సమస్యలు వస్తున్నపుడు ఆక్వా నాయకులుగా చలామణీ అవుతున్నా కొందరు ఎందుకొచ్చిన తంటా అంటూ నోరుమెదపడం లేదు. ఉదాహరణకు బుధవారం 100 కౌంట్ రొయ్యల ధర రూ.260 ఉండగా గురువారం రూ.250కి చేరింది. దళారులు సాకులు చెప్పి రూ.240కి కొనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ(అప్సడా) నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆక్వారంగంలో ధరల స్థిరీకరణకు ప్రత్యేక చట్టం చేయాలని పలువురు కోరుతున్నారు.
రొయ్యల పట్టుబడి
రొయ్యల మేత
చంద్రబాబు పాలనలో ౖపైపెకి మేతల ధరలు
ఎన్నికల హామీల అమలులో వైఫల్యం
కరోనాలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుకు సేవలు
ప్రభుత్వాన్ని ప్రశ్నించని కూటమిలో ఆక్వాసాగు నాయకులు


