20న మెడికల్‌ షాపుల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

20న మెడికల్‌ షాపుల బంద్‌

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

చెరువు మట్టి.. కొల్లగొట్టి 20న మెడికల్‌ షాపుల బంద్‌

ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్షలకు 780 మంది హాజరు

చెరువు మట్టి.. కొల్లగొట్టి
ద్వారకాతిరుమల మండలంలోని కొందరు టీడీపీ నాయకులు రాత్రి అయితే చాలు చెరువుల్లోకి చేరి అక్రమంగా మట్టిని తరలించి జేబులు నింపుకుంటున్నారు. 8లో u

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కెమిస్టుల జీవనాధారం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపుల బంద్‌ నిర్వహించనున్నట్లు కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గుట్ట రవిచంద్ర తెలిపారు. ఏలూరులోని అసోసియేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఔషధ పంపిణీదారులు ఆన్‌లైన్‌ ఫార్మసీల నియంత్రణ లేని కార్యకలాపాలు, పెద్ద కార్పొరేట్‌ సంస్థల అన్యాయ భారీ డిస్కౌంట్‌ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 20న దేశవ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెక్రటరీ వజ్రపు శేఖర్‌, ఈసీ మెంబర్లు నెరుసు కృష్ణ చైతన్య, చెన్నా రామ్‌ కుమార్‌, ఎం.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఏలూరులో మొత్తం 780 మంది పరీక్షలకు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో 120కి గాను 117 మంది, ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 170కిగాను 163 మంది, మధ్యాహ్నం 170కిగాను 159 మంది, ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 180కి గాను 168 మంది, మధ్యాహ్నం 180కి గాను 173 మంది హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement