ఆక్వా రంగమే ఆర్థిక పరిపుష్ఠికి వెన్నెముక అని ఒక్క పక్క చెబుతూనే, మరొపక్క ఆక్వారంగం నడ్డివిరుస్తున్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా చెప్పిన మేనిఫెస్టోను అమలు చేయాలి. మేతల కంపెనీలను ప్రభుత్వమే కట్టడి చేయాలి.
– గంటా సంధ్య, వైఎస్సార్‌సీపీ
రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీ, ముదినేపల్లి
ఆక్వా రైతులు అప్పులు చేసి మరీ ఆక్వా సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల రొయ్యల సాగులో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీనికితోడు మేతల ధరలు పెంచడం దారుణం. వైఎస్ జగన్ పాలనకు, కూటమి పాలనకు మద్య తేడాను ఆక్వా రైతులు గమనిస్తున్నారు.
– సమయం వీరాంజనేయులు,
ఆక్వారైతు, వైఎస్సార్ సీపీ టౌన్ అధ్యక్షుడు, కై కలూరు
రాష్ట్రంలోనే అధిక ఆక్వా ఉత్పత్తుల్లో ఈ ప్రాంతం వినతికెక్కింది. కూటమి పాలనలో ఆక్వా సాగు మేతల ధరల నియంత్రణ లేదు. పండించిన రైతు అందినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. దళారులు లాభపడుతున్నారు. ఈ విధానం మారకపోతే పంట విరామం తప్పదు.
– ఐనాల బ్రహ్మాజీరావు, ఆక్వా రైతు,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీ


