వైభవంగా శ్రీచక్రస్నానం, మహా పూర్ణాహుతి | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీచక్రస్నానం, మహా పూర్ణాహుతి

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

వైభవంగా శ్రీచక్రస్నానం, మహా పూర్ణాహుతి

జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు గురువారం నిత్య హోమం, వసంతోత్సవం, శ్రీచక్రస్నానం, మహా పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. రాత్రి గజవాహన సేవ, ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్‌ యాజమాన్యం వల్లభనేని శ్రీనివాసరావు, ప్రసన్నలక్ష్మి దంపతులు, కోటపోతుల బాబి, కోటపోతుల శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. పండితులు పోనంగి పవన్‌కుమార్‌ ఆచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్‌ ఆచార్యులు, ఋషికేశ్‌ ఆచార్యులు వైదిక కార్యక్రమాలు చేశారు. శుక్రవారం ధ్రువమూర్తికి పంచామృత అభిషేకం, నవకల స్నపనం, ద్వాదశ ఆరాధన, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగం నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ అల్లూరి రామకృష్ణ, ఈఓ కలగర శ్రీనివాస్‌ పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement