పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ కారణంగా ఒక భక్తుడు పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్‌ తిరిగి అతడికి దక్కింది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోనిఖమ్మంకు చెందిన భవానీ శంకర్‌, కావేరీల వివాహం బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఉదయం వారు శ్రీవారి క్షేత్రానికి వచ్చారు. ఆలయం నుంచి బయటకు వెళ్లే సమయంలో తన చేతికి ఉండాల్సిన సుమారు మూడున్నర కాసుల బంగారు బ్రాస్లెట్‌ లేకపోవడాన్ని భవానీ శంకర్‌ గుర్తించి ఆలయ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనివేటి మండపంలో పారిశుదద్ధ్య పనులు నిర్వహిస్తున్న అన్నపురెడ్డి దుర్గకు ఈ బ్రాస్లెట్‌ దొరికింది. వెంటనే ఆమె ఆలయ కార్యాలయానికి వెళ్లి, అక్కడున్న భవానీ శంకర్‌కు దాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు దుర్గను అభినందించారు.

పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్‌ భక్తుడికి అందజేత

Advertisement
 
Advertisement
Advertisement