న్యూస్‌రీల్
నడిరోడ్డుపై పడిగాపులు
కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. 8లో u
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026
ద్వారకాతిరుమల: మండలంలోని రామన్నగూడెంలో రావుల చెరువు ‘పచ్చ’ రాబందుల పాలయ్యింది. చెరువులోని మట్టిని కొందరు పచ్చ నేతలు పగలూరాత్రీ తేడా లేకుండా తవ్వి తరలించేస్తున్నారు. వచ్చిన సొమ్ములు నీకింతా.. నాకింతా అంటూ పంచుకుంటున్నారు. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ దందా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వివాదాస్పదమైంది. గత నెలలో జరిగిన డీఆర్‌సీ సమావేశంలో సైతం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ఈ చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై అధికారులను నిలదీశారు. దీంతో కొద్దిరోజుల పాటు నిలిచిపోయిన మట్టి దందా.. మళ్లీ మొదలయ్యింది. నాలుగు రోజుల నుంచి యథేచ్ఛగా మట్టి తరలించేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.
దుమారం రేపిన తవ్వకాలు
43.77 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రావుల చెరువు కింద ఆయకట్టు 114.98 ఎకరాలు ఉంది. చెరువు అభివృద్ధికి కలెక్టర్ వెట్రిసెల్వి ఆమోదంతో మినరల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.94.30 లక్షల నిధులు మంజూరు చేశారు. జిల్లా మొత్తం మీద మైనింగ్ నుంచి ఇంత నిధులు మంజూరైన ఏకైక చెరువు ఇదే. అయితే చెరువు పూడికతీత పనుల పేరుతో కొందరు నేతలు మట్టి అక్రమ రవాణాను సాగించారు. దీనిపై డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ అధికారులను నిలదీశారు. దీంతో సదరు నేతలు కొద్దిరోజులు సైలెంట్ అయ్యి, అక్రమ రవాణాకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఇదిలా ఉండగా గ్రామంలోని రైతులు అవసరం మేరకు తమ పొలాలకు చెరువు మట్టిని తోలుకోవచ్చని కొందరు పెద్దలు నిర్ణయించారట. అయితే రైతుల పొలాలకు కాకుండా మట్టి ఇలా బయటకు తరలిపోతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.
రోడ్డు నిర్మాణ పనుల పేరుతో..
ఈనెల 17న రాత్రి నుంచి మళ్లీ చెరువులో మట్టి తవ్వకాలను ప్రారంభించారు. నల్లజర్ల మండలం కొత్తగూడెం, పరిసర ప్రాంతాలకు రోజుకు వందకు పైగా టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు. ద్వారకాతిరుమల మీదుగా 13 టిప్పర్ల ద్వారా ఈ అక్రమ రవాణా జరుగుతోంది. పుంత రోడ్ల నిర్మాణ పనుల పే రుతో మట్టిని తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అభివృద్ధి పనుల ముసుగులో చెరువును కొల్లగొట్టి, కొందరు నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. దీనిపై ద్వారకా తిరు మల తహసీల్దార్ జేవీ సుబ్బారావు వివరణ ఇస్తూ రావుల చెరువు సుందరీకరణకు మైనింగ్ శాఖ నుంచి నిధులు మంజూరు చేశారన్నారు. వాటితోనే చె రువులో పనులు జరుపుకోవాల్సి ఉందన్నారు.
తవ్వేయ్.. తరలించేయ్
చెరువులనూ వదలని మట్టి మాఫియా
రాత్రీపగలూ యథేచ్ఛగా మట్టి రవాణా
వాటాలు పంచుకుంటూ దందా
చోద్యం చూస్తున్న అధికారులు


