జనాన్ని చంపేస్తే అది సుపరిపాలనా?
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చంద్రబాబు పాలనా వైఫల్యంతో ఆధ్యాత్మిక కేంద్రాల్లో తొక్కిసలాటలు జరుగుతూ అమాయక ప్రజలు చనిపోతుంటే అదే సుపరిపాలన అనుకోవాలా అని దేవదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయాలకు సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్ర మాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కో ల్పోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించా రు. కాశీబుగ్గలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ నిర్వాహకుడు ముందుగానే అధికారులకు, పోలీసులకు తెలిపినా వారు పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమేనని స్పష్టం చేశారు. అలాగే గతంలో తిరుమలలో ఆరుగురు, సింహాచలంలో ఏడుగురు చనిపోయిన విషయాన్ని మరి చిపోలేమన్నారు. ప్రచార యావ తప్ప ఎంతమంది చనిపోయారో అనే దానిపై మసిపూసి మారేడు కాయ చేయడానికి చంద్రబాబు.. తనకు ఉన్న ఎల్లో మీడియా ద్వారా పక్కదారి పట్టిస్తున్నాడని మండిపడ్డారు. 2018లో ఒంటిమిట్టలో కూడా చంద్రబాబు హయాంలోనే భక్తులు చనిపోయారని గుర్తుచేశారు. ఆలయాల్లో ఇటువంటి ఎన్ని సంఘటనలు జరిగినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదన్నారు. ఐదేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆలయాల్లో ఇటువంటి సంఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను జగన్ హయాంలో పున రుద్ధరించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు.
చంద్రబాబు బాధ్యత వహించాలి
కాశీబుగ్గ ఘటనకు చంద్రబాబే పూర్తి బాధ్యత వ హించాలని కొట్టు డిమాండ్ చేశారు. బీజేపీ నా య కులు కూడా కాశీబుగ్గ ఘటనపై విచారం వ్యక్తం చే యకపోవడం చూస్తుంటే హిందూత్వం వారి రాజకీయాల కోసం వాడుకునే వస్తువుగా అనిపిస్తోందన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
