మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
పెదవేగి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ జానంపేట బాబు ఆధ్వర్యంలో ఆదివారం కొప్పాకలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమానికి కొఠారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సీపీ కార్యకర్త సనంపూడి రాంబాబు ఇంటి వద్ద ఏర్పాటుచేసిన కోటి సంతకాల సేకరణ, ప్రజా ఉద్యమం–రచ్చబండ కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులకు కాలేజీలను కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. వీటని ప్రైవేటుపరం కాకుండా రక్షించుకుంటేనే భవిష్యత్తులో పేద పిల్లలు డాక్టర్లు అవుతారన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ రేషన్ పంపిణీ చేయాలని మేం చూస్తే, కూ టమి నేతలు మందు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో 300కు పైగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను తీసే సి, కూటమి నేతల ఫొటోలు, పేర్లు పెట్టుకోవడం సి గ్గుచేటని దుయ్యబట్టారు. దుర్మార్గ చర్యలకు పాల్పడితే అబ్బయ్యచౌదరి 2.0లో చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. జెడ్పీటీసీ పెనుమాల విజయ్‌బాబు, ఎంపీపీ తాతా రమ్య, సర్పంచ్‌లు మాత్రపు కోటేశ్వరరావు, దేవరపల్లి ఏసుమరియమ్మ, ఎంపీటీసీలు గెడ్డం సుజాత, పులవర్తి దేవానంద్, మాజీ ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, నాయకులు చళ్ళగొళ్ల భూ స్వామి తదితరులు పాల్గొన్నారు.


