జోగి రమేష్ అరెస్ట్ అక్రమం
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
బుట్టాయగూడెం: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమమని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి రమేష్‌ను అక్రమ మద్యం కేసులో ఇరికించారన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తూ అక్రమ కేసులు కడుతున్నారని విమర్శించారు. నారా వారి సారా, కల్తీ మద్యం పల్లెల్లో ఏరులై పారుతుందని ఆరోపించారు. అలాగే కాశీబుగ్గ సంఘటనను డైవర్షన్ చేసేందుకే జోగి రమేష్ అరెస్ట్ చూపించారన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులను భయపెట్టా లని చూస్తే బెదిరే ప్రసక్తే లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ కోసం మరింత ముందుండి నడిపిస్తామని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రో జుల్లో వారికి ఆ ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అక్రమ అరెస్ట్‌లను ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండించాలని బాలరాజు కోరారు.


