తుపాను బాధిత రైతులను ఆదుకోవాలి
మండవల్లి: మోంథా తుపాను వల్ల నష్టపోయిన పంట పొలాలకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. మండలంలోని అయ్యవారిరుద్రవరంలో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి, ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్‌తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం అంచనాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 800 ఎకరాలు దెబ్బతిన్నట్టు రైతులు చెప్పారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని వారికి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు, రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర వాణిజ్యవిభాగ కార్యదర్శి, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, మైనార్టీ విభాగ కార్యదర్శి ఎండి గాలీబ్, మండల పార్టీ అధ్యక్షుడు బేతపూడి యేసోబురాజు, మండల రైతువిభాగ అధ్యక్షుడు బొమ్మనబోయిన గోకర్ణయాదవ్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బోణం శేషగిరి, జిల్లా యాక్టివ్ సెక్రెటరీ నాగదాసి థామస్, కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు పాము రవికుమార్, మెండా సురేష్‌బాబు, కై కలూరు టౌన్ పార్టీ అధ్యక్షుడు సమయం రామాంజనేయలు, కై కలూరు మండల రైతు విభాగ అధ్యక్షుడు సలాది వెంకటేశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు చిన్ని కృష్ణ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పెంటా అనిల్, నియోజకవర్గ సోషల్ మీడియా విభాగ అధ్యక్షులు మండా నవీన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇంటి నాగరాజు, కుంచే రాజేష్, కుంచే వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


