కొల్లేరులో కల్లోలం | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో కల్లోలం

Oct 30 2025 9:10 AM | Updated on Oct 30 2025 9:10 AM

కొల్ల

కొల్లేరులో కల్లోలం

కొల్లేరులో కల్లోలం

కై కలూరు: కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. మోంథా తుపాను ప్రభావానికి ఎగువ నుంచి చేరిన వర్షపు నీటితో కొల్లేరు సరస్సు నిండుకుండలా మారింది. కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే మార్గాలైన పెదఎడ్లగాడి వంతెన, పోల్‌రాజ్‌ కాల్వ, ఉప్పుటేరులో రోజురోజుకు నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే పెనుమాకలంక రహదారి రెండు వారాలుగా నీటిలో నానుతోంది. తాజాగా గోకర్ణపురం – పైడిచింతపాడు రోడ్డు వరద నీటికి మునిగింది. రహదారి మార్గాలు మూసుకుపోవడంతో సమీప గ్రామాల ప్రజలు పనులు లేక అల్లాడుతున్నారు.

సాధారణంగా తుపానులు, భారీ వర్షాలు కురిసిన నాలుగు రోజులకు కొల్లేరులో నీటి ఉధృతి పెరుగుతోంది. మోంథా తుపానుకు ముందు బంగాళాఖాతంలో అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు కొల్లేరుకు భారీ వర్షపు నీరు చేరింది. తాజాగా తెలంగాణలో సైతం తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. మొత్తం 122 పరివాహక గ్రామాలు ఉన్నాయి. కొల్లేరుకు 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు నుంచి నీరు ఎక్కువగా వస్తుంది. రోజురోజుకు నీటిమట్టం పెరగడంతో కొల్లేరు ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

రహదారులకు రాకపోకలు బంద్‌

కొల్లేరుకు చేరుతున్న భారీ వర్షాలకు రహదారులు నీట మునుగుతున్నాయి. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన నుంచి పెనుమాకలంక గ్రామానికి చేరే రోడ్డు రెండు వారాలుగా నీటిలో నానుతోంది. దీంతో పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, శ్రీరామ్‌నగర్‌ వెళ్లే ప్రజలకు రహదారి సౌకర్యం లేదు. అదే విధంగా మోంథా తుపాను దాటికి కై కలూరు మండలం గోకర్ణపురం నుంచి ఏలూరు చేరే రహదారిపై నుంచి కొల్లేరు నీరు ప్రవహిస్తోంది. ప్రధానంగా ఏలూరు, చాటపర్రు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, పైడి చింతపాడు మీదుగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం చేరడానికి 22 కిలోమీటర్లతో దగ్గర మార్గంగా ఉంది. రోడ్డు మూసుకుపోవడంతో 35 కిలోమీటర్లు చుట్టూ తిరిగి కై కలూరు మీదుగా రావాల్సి వస్తుంది. మరిన్ని రహదారులు మునిగే అవకాశం కనిపిస్తోంది.

ఉప్పుటేరు ఉధృతం

కొల్లేరు నీటిని సముద్రానికి పంపించడానికి ఏకై క మార్గంగా ఉన్న ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉప్పుటేరు పరివాహక గ్రామాలకు మంపు ముప్పు పొంచి ఉంది. కై కలూరు మండలం కొట్టాడ, రాజుల కొట్డాడ, జంగంపాడు పల్లెపాలెం రేవుల వద్ద నీటి మట్టం పెరిగింది. కొల్లేరులో ఇప్పటికే చేపల చెరువుల్లో నీరు గట్టుల వరకు ఉంది. భారీ వరద నీటికి గట్లు తెగితే ఆ నీటితో మరింత ప్రమాదంగా మారుతుంది. పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.57 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇది 3 మీటర్లకు చేరితే ప్రమాదమని అధికారులు చెప్పారు.

వలలను కాపాడుకోడానికి పోల్‌రాజ్‌ కాల్వ వద్ద సిద్ధంగా ఉంచిన ఇసుక బస్తాలు

మండవల్లి మండలం కాకతీయనగర్‌ వద్ద ఉధృతంగా పోల్‌రాజ్‌ కాల్వ

మోంథా తుపానుతో భారీగా వర్షంనీరు

కొల్లేరులో నీట మునిగిన రహదారులు

చిగురుటాకుల వణుకుతున్న లంక గ్రామాల ప్రజలు

పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.57 మీటర్ల నీటిమట్టం నమోదు

కొల్లేరులో కల్లోలం1
1/5

కొల్లేరులో కల్లోలం

కొల్లేరులో కల్లోలం2
2/5

కొల్లేరులో కల్లోలం

కొల్లేరులో కల్లోలం3
3/5

కొల్లేరులో కల్లోలం

కొల్లేరులో కల్లోలం4
4/5

కొల్లేరులో కల్లోలం

కొల్లేరులో కల్లోలం5
5/5

కొల్లేరులో కల్లోలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement