మురుగునీటి పారుదలకు మార్గం సుగమం
పాలకొల్లు సెంట్రల్: అగ్రికల్చరల్ మార్కెట్ యార్డు ప్రహరీ గోడ మునిసిపల్ డ్రెయినేజీలో పడిపోవడంతో మురుగునీరు పారుదల లేకుండా పోయింది. దీనిపై ఈ నెల 25వ తేదీన ‘వర్షానికి కూలిన ఏఎంసి ప్రహరీ’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై మునిసిపల్ అధికారులు స్పందించారు. మురుగునీరు పారుదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పొక్లెయిన్‌తో ప్రహరీగోడ శిథిలాలను తొలగించారు. మురుగునీటి పారుదలకు మార్గం సుగమం చేశారు. దీంతో తుపాను ప్రభావం వల్ల కురిసిన వర్షానికి మురుగునీరు పారుదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో స్థానిక ప్రజలు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలియజేశారు. మిగిలిన ప్రహరీగోడను తొలగించడంలో మాత్రం స్పందించాల్సిన ఏఎంసీ అధికారులు మొద్దునిద్రను వీడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆకివీడు: ఖరీఫ్ సాగులో రైతులు తెగుళ్ల బెడదతో బెంబేలెత్తుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని వరి చేలకు ఆకుపచ్చ తెగులు, ముడత, పండాకు తెగులు, కోడు వంటివాటితో సతమతమవుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వరి చేలు ఈనిక, గింజ పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ దశలో తెగుళ్ల బారిన పడటం వల్ల కుదుళ్లకు నష్టం వాటిల్లి దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా మోంథూ తుపాను తాకిడికి మండలంలోని పలు గ్రామాల్లో 600 ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగింది. దీనికితోడు ఎగువ ప్రాంతం నుంచి ముంపునీరు భారీగా చొచ్చుకువస్తుండడంతో రానున్న రోజుల్లో ఇంకా వందల ఎకరాలు నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని కడకట్ల ఫ్లైౖఓవర్ రోడ్డులోని లక్ష్మీసాహితీ ఆటో కన్సల్టెన్సీ ఫైనాన్స్ షాప్‌లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపు నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. షాపులో 44 ద్విచక్రవాహనాలు ఉండగా 2 పూర్తిగా దగ్ధమయ్యాయి. 3 వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసినట్లు ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియరాలేదని అధికారులు చెప్పారు. నష్టం వివరాలు తెలియరాలేదు.
మురుగునీటి పారుదలకు మార్గం సుగమం
మురుగునీటి పారుదలకు మార్గం సుగమం
మురుగునీటి పారుదలకు మార్గం సుగమం


