అపార పంట నష్టం
న్యూస్‌రీల్
కొల్లేరులో కల్లోలం
కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. మోంథా తుపాను ప్రభావానికి ఎగువ నుంచి చేరిన వర్షపు నీటితో కొల్లేరు సరస్సు నిండుకుండలా మారింది. 8లో u
సంసారంలో ఒడిదొడుకులు తట్టుకోలేక, అవమానభారంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో దంపతులు మృతి చెందారు. 8లో u
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సంస్థకు రూ.35.96 లక్షల నష్టం వాటిల్లింది. 20 11 కేవీ ఫీడర్లు తుపాను కారణంగా ప్రభావితమయ్యాయి. ఎనిమిది 33 కేవీ స్తంభాలు, 11 కేవీ స్తంభాలు 66, 109 లో టెన్షన్ స్తంభాలు దెబ్బతిన్నాయి. 22 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ ఎస్‌ఈ పీ.సాల్మన్ రాజు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో 129 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.
మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 107 చెట్లు కూలిపోయాయి. 4 పశువులు మృతి చెందగా ఒక ఇల్లు దెబ్బతింది. తుపాను నిమిత్తం వైద్యారోగ్యశాఖ 318 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 148 వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 474 డ్రెయిన్లలో సిల్ట్ తొలగించారని సంబంధిత శాఖాధికారులు నష్టం వివరాలను అంచనా వేశారు.
గురువారంలోపు నష్టం అంచనాలు
తుపాను తీవ్రత తగ్గడంతో గురువారం నుంచి యథావిధిగా విద్యాసంస్థలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. తుపాను ముగిసిపోవడంతో బుధవారం రాత్రి వరకే 90 సహాయ కేంద్రాలను నిర్వహిస్తామని, 3,420 కుటుంబాలకు చెందిన 7 వేల మందికి భోజన వసతి కల్పించామని, బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంటనూనె, రెండు రకాల కూరగాయలు 2 కిలోల చొప్పున, మనిషికి రూ. వెయ్యి, కుటుంబానికి గరిష్టంగా రూ.3 వేలు అందిస్తామని ప్రకటించారు. శాఖల వారీగా గురువారంలోపు నష్టం అంచనాలను సిద్ధం చేయనున్నారు. ప్రధానంగా విద్యుత్, వ్యవసాయ, ఆర్‌అండ్‌బీ శాఖలతో పాటు ఇతర శాఖల నుంచి నష్టం అంచనా నివేదికలు తెప్పించి ప్రభుత్వానికి పంపనున్నారు.
కై కలూరు: మోంథా తుపాను నష్టాలను ప్రభుత్వ శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో నివారించామని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ చెప్పారు. నియోజకవర్గంలో కై కలూరు, భైరవపట్నం గ్రామాల్లో కొనసాగుతున్న తుపాను పునరావాస కేంద్రాలను బుధవారం సందర్శించారు. నిర్వాసితులకు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ పెద్ద తుపానును పోలీసు, రెవెన్యూ ఇతర శాఖలతో కలసి ఒక్క ప్రాణనష్టం లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినా తక్షణం తొలగించారన్నారు. ముందస్తు చర్యల వల్ల ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయం అవసరం రాలేదన్నారు. పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కై కలూరు టౌన్, రూరల్ సర్కిల్ సీఐలు ఏవీఎస్.రామకృష్ణ, వి.రవికుమార్, ఎస్‌ఐలు డి.వెంకట్ కుమార్, ఆర్.శ్రీనివాస్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో తుపాను ప్రభావం తగ్గడం వల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాల భవనం, ప్రాంగణం మొత్తం పరిశీలించాలని, ఎక్కడైనా తుపాను వల్ల చెట్లు, లేదా కొమ్మలు లేదా బిల్డింగు పైకప్పు పెచ్చులు సరిగా ఉన్నాయా, టైల్స్ ఊడిపోయాయా అని పరిశీలించాలని సూచించారు. తాగునీటి ట్యాంకులు, హ్యాండ్ పంప్‌లు, ట్యాపులు పరిశీలించి నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. పాఠశాల పరిసరాలలోని విద్యుత్ లైన్‌న్‌లు, సాకెట్లు సురక్షితంగా ఉన్నాయా లేదా సరిచూడాలని, ఎక్కడైనా నీరు నిలిచిపోవడం, విద్యుత్ ప్రమాదం, గోడ కూలే పరిస్థితి, లేదా విద్యార్థులకు ప్రమాదకర వాతావరణం ఉంటే పాఠశాలను తాత్కాలికంగా మూసివేసి వెంటనే ఎంఈఓ/డీవైఈఓ/డీఈఓ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు.
ఏలూరు(మెట్రో): ప్రస్తుత సీజన్‌లో రైతుల నుంచి రికార్డు స్థాయిలో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్‌లో బుధవారం మాట్లాడుతూ తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లతో చర్చించామన్నారు. పంట నష్టాలపై ఈ నెల 30 లోగా నివేదికలు అందించాలని ఆదేశించామన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో 10 నుంచి 30 టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, అవసరం ఉన్న రైతులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు.
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు ధర పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు ధర పెరిగింది. మంగళవారం ధర రూ.455 ఉండగా.. బుధవారం మరో రూపాయి పెరిగి రూ.456కు చేరింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలో ఐదు వేలం కేంద్రాల్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలతో పాటు కొయ్యలగూడెం వేలం కేంద్రంలో అత్యధికంగా కేజీ ఒక్కింటికి రూ.456 లభించింది. గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల్లో రూ.455 లభించింది. లోగ్రేడ్ పొగాకుకు మాత్రం సరైన ధర లభించడం లేదు. లోగ్రేడ్ పొగాకు బుధవారం కేజీ ఒక్కింటికి రూ.50 మాత్రమే లభించింది. ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలో ఇప్పటి వరకు సరాసరి ధర కేజీ ఒక్కింటికి రూ.305.01 లభించింది.
విశాఖ సిటీ: మోంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్‌కు రూ.10.47 కోట్లు నష్టం సంభవించింది. అధికారులు విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపడుతున్నారు. 7,973 మంది విద్యుత్ సిబ్బందితో 523 బృందాలుగా నిరంతరం శ్రమిస్తున్నారు. ఎక్కువ నష్టం జరిగిన కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి సర్కిళ్లలో ఇప్పటివరకు 13,56,415 సర్వీసు కనెక్షన్లకు గాను 13,02,948 పునరుద్ధరించారు. గురువారం నాటికి విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి పేర్కొన్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మోంథా తుపాను తీరం దాటింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు కొంతమేర ఊపిరిపీల్చుకున్నా.. తుపాను తీవ్రతతో గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలకు అపారనష్టం వాటిల్లింది. 20 వేలకుపైగా ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయాయి. కోత దశకు వచ్చిన వరి, మినుము, ఇతర ఉద్యానవన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఇంకోవైపు వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి.
తుపాను తీవ్రతకు గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు అన్ని నియోజకవర్గాల్లో పంట నష్టం భారీగా వాటిల్లింది. ప్రధానంగా కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ఎక్కువ నష్టం జరిగింది. వ్యవసాయశాఖాధికారుల పంట నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 5,540 ఎకరాలు, కై కలూరు నియోజకవర్గంలో 3,336 ఎకరాలు, పోలవరంలో 4,487, ఏలూరులో 1,500 ఎకరాలు, చింతలపూడిలో 813, దెందులూరులో 1050, నూజివీడులో 1700 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం నష్టపోయిన పంటల్లో 80 శాతానికిపైగా వరి పంటే. మరో వారం రోజుల్లో కోతలు ప్రారంభం కావాల్సి ఉన్న తరుణంలో పొలాల్లోకి నీరు చేరడం, వరి కంకులు నేలకొరగడంతో నష్టం వాటిల్లింది. నూజివీ నియోజకవర్గంలో 1700 ఎకరాల్లో మినుము పంటతో పాటు 120 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. మోంథా తుఫాన్ నేపథ్యంలో మంగళవారం జిల్లాలో 4.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జీలుగుమిల్లిలో 1.8 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దాదాపు 31 మండలాలకుగాను 25 మండలాల్లో వర్షం జాడే లేకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
కొల్లేరు, ఉప్పుటేరు పెరుగుతున్న వరద : ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కొల్లేరు సరస్సు, ఉప్పుటేరు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మోంథా తుపానుకు ముందే ఈ రెండూ నిండుగా ఉన్నాయి. సుమారు 64 ప్రధాన కాల్వల నీరు కొల్లేరుకు అక్కడి నుంచి ఉప్పుటేరుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో రెండు గరిష్ట నీటిమట్టానికి చేరాయి. పెద ఎడ్లగాడి వంతెన వద్ద కొల్లేరు 2.57 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ఇప్పటికే పెనుమాలంక వంతెన వారం రోజులుగా జలదిగ్భందంలో చిక్కుకుంది. 3 మీటర్ల ఎత్తు దాటితే కొల్లేరులోని చెరువుల గట్లు తెగి మత్స్యసంపదంతా కొల్లేరు పాలవడటంతో పాటు 15 లంక గ్రామాల్లోకి వరదనీరు చేరే ప్రమాదముంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా కాల్వల్లో నీరు భారీగా కొల్లేరులోకి చేరుతుంది. మరోవైపు ఉప్పుటేరుకూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. 6 అడుగుల ఎత్తులో బలమైన ప్రవాహం ఉంది. ఉప్పుటేరు వద్ద 7 అడుగులు దాటితే పలు గ్రామాల్లోకి నీరు చేరే ప్రమాదం ఉంది.
ప్రత్తికోళ్లలంకలో రోడ్డుపైకి చేరిన వర్షం నీరు
భీమడోలు మండలంలో మొలకలు వచ్చిన వరి
ఏలూరులో లునానినగర్ నుంచి బీడీ కాలనీకి వెళ్లే రోడ్డు ఇలా..
బుట్టాయగూడెం మండలం ఎన్‌ఆర్‌పాలెంలో మునిగిన వరి చేను వద్ద రైతు
బుట్టాయగూడెం: తుపాను ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని నూతిరామన్నపాలెం, అచ్చియ్యపాలెం గ్రామాల్లో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను బుధవారం మాజీ ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఎన్నో కష్టాలు పడి రైతులు పంటలు వేశారని పంట చేతికి వచ్చే సమయానికి కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ముఖ్యంగా పలు చోట్ల వరిపంట పొలాల్లోకి వర్షపు నీరు చేరి అన్నిట్లోనూ వరి కంకులు నానుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, సర్పంచ్ మొడియం లక్ష్మి, నాయకులు కిరణ్, పెంటపాటి శ్రీను, పూనెం వెంకటేశ్వరరావు, ఏలేటి చంద్రం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు
సహాయక చర్యలు ముమ్మరం చేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో తుపాను సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం సహాయ కార్యక్రమాలపై జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలతో తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. జిల్లా యంత్రాంగం మంచి స్పూర్తితో పనిచేసిందని, అదే స్పూర్తితో సహాయక కార్యక్రమాలను చేపట్టాలని, ఆస్తి, పంట, పశు నష్టం అంచనాలను ఈనెల 30 నాటికి పూర్తి చేయాలని మంత్రి చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. నదులు, చెరువులు, వాగులు, కాలువల గట్ల పటిష్టతను పరిశీలించాలని, బలహీనంగా గట్లను పటిష్టం చేయాలన్నారు. సహాయక శిబిరాలు బుధవారం రాత్రి వరకు నిర్వహిస్తామని, బాధిత కుటుంబాలకు కేంద్రం నుంచి వెళ్లే సమయంలో కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంట నూనె, రెండు రకాల కూరగాయలు అందిస్తామని, చెప్పారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే మాట్లాడుతూ తుపాను అనంతరం సహాయక చర్యలను అదే స్పూర్తితో అధికారులు, సిబ్బంది చేపట్టాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మంత్రులు, ప్రజాప్రతినిధులు, తుపాను ప్రత్యేక అధికారులు అందించిన సూచనలతో ముందుగానే ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
19 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
వరి పంటకు భారీ నష్టం
ప్రమాద స్థాయిలో కొల్లేరు, ఉప్పుటేరు
ఆక్వా చెరువుల్లో పడిపోతున్న ఆక్సిజన్ లెవల్స్
నేలకొరిగిన వందల విద్యుత్ స్తంభాలు
అపార పంట నష్టం
అపార పంట నష్టం
అపార పంట నష్టం
అపార పంట నష్టం
అపార పంట నష్టం
అపార పంట నష్టం
అపార పంట నష్టం
అపార పంట నష్టం
అపార పంట నష్టం
అపార పంట నష్టం


