అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

Aug 4 2025 3:35 AM | Updated on Aug 4 2025 3:35 AM

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

ద్వారకాతిరుమల: స్థానిక వెలుగు కార్యాలయ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పింది. డ్రైవర్‌ అప్రమత్తమై చాకచక్యంగా బస్సును నిలుపుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏలూరు నుంచి ద్వా రకాతిరుమల మీదుగా జంగారెడ్డిగూడేనికి 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు ఘటనా స్థలం వద్ద ఎత్తు ఎక్కేటప్పుడు ఒక్కసారిగా టైర్‌ పంక్చర్‌ అయ్యింది. దీంతో రోడ్డు వెనుక పల్లంగా ఉండటంతో బస్సు అదుపు తప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును గేర్‌లో నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వారిని వేరే బస్సులో ఎక్కించి పంపించారు.

వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ శ్రేణుల దాడి

నూజివీడు: వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొంటున్నాడనే కక్షతో నూజివీడు మండలం జంగంగూడెంలో వైఎస్సార్‌సీపీ నేత తొమ్మండ్రు రాజేశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఇద్దరు శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. రాజేశ్వరరావు రెండు నెలలుగా వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తూ విజయవంతంగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓర్వ లేని టీడీపీ కార్యకర్తలు కొలికపాం వెంకటేశ్వరరావు, తొమ్మండ్రు సింహాద్రి మాట్లాడాలని చెప్పి గ్రామంలోని చెరువు కట్ట వద్దకు రాజేశ్వరరావును తీసుకువెళ్లి రాయితో దాడి చేసి కొట్టారు. రాజేశ్వరరావు వారి నుంచి తప్పించుకుని తుక్కులూరు చేరుకుని 108 వాహనం ద్వారా నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరా రు. బాధితుడి నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు.

ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్షలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశల నిమిత్తం ఆదివారం నీట్‌ పీజీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, సి ద్ధార్థ క్వెస్ట్‌ విద్యాసంస్థల్లో 373 మంది విద్యార్థులకు 343 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 200 మందికి 181 మంది, సిద్ధార్థ క్వెస్ట్‌లో 173 మందికి 162 మంది హాజరయ్యారు.

భీమవరంలోని ఒక కేంద్రంలో..

భీమవరం: భీమవరంలో ఆదివారం నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. డీఎన్నార్‌ అటానమస్‌ కళాశాలలో ఉదయం 169 మంది విద్యార్థులకు 160 మంది హాజరయ్యారని, మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని కళాశాల పరీక్షల నిర్వాహకుడు తెలిపారు.

విద్యార్థుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం

ఏలూరు (టూటౌన్‌): కూటమి ప్రభుత్వం వి ద్యార్థుల హక్కులను కాలరాస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ ఏలూరు నగర కార్యదర్శి బి.మనోజ్‌ విమర్శించారు. స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30/67 జీఓను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ జీఓ ద్వారా కార్పొరేట్‌ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా దోచుకోవడానికి మంత్రి లోకేష్‌ అవకాశమిచ్చారన్నారు. చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో ఇప్పటికే పలువురు వి ద్యార్థులు ఒత్తిళ్లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ జీఓ వెనక్కి తీసుకోకుంటే రా ష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని మనోజ్‌ హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు ఎస్‌.శివాజీ మాట్లాడుతూ ఏలూరులోని ప్రభు త్వ హాస్టళ్లలో పలు సమస్యలు ఉన్నాయని, ఎస్సీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు మత్తుపదార్థాలకు అలవాటు పడ్డారన్నారు. అమీనాపేటలోని బాలికల హాస్టల్‌కు రక్షణ కరువైందన్నారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నగర నూతన కమిటీ ఎన్నికై ంది.

బీసీ హాస్టళ్ల తనిఖీ

ఏలూరు (టూటౌన్‌): ఏలూరులోని బీసీ సంక్షేమ హాస్టళ్లను ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు డి.చంద్రశేఖరరాజు తనిఖీ చేశారు. ఏలూరులోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు, బీసీ బాలికల వసతి గృహం నం.1, 2, కళాశాల వసతి గృహం నం. 1,2లను పరిశీలించారు. విద్యార్థుల భోజనాలు, రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం క్లీన్‌–గ్రీన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఆర్‌వీ నాగరాణి, సహాయ బీసీ సంక్షేమ అధికారి టి.వెంకటేశ్వర్లు, వసతి గృహ సంక్షేమ అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement