
జోరుగా చేపనారు ఉత్పత్తి
ఉంగుటూరు: రాష్ట్రంలోనే పేరుగాంచిన బాదంపూడి ప్రభుత్వ మత్స్య కేంద్రంలో చేపనారు ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇక్కడ చేపనారు ఉత్పత్తి జూలై నుంచి ప్రారంభించి నవంబరు వరకు కొనసాగిస్తారు. ఈ ఏడాది చేపనారు ఉత్పత్తి లక్ష్యం 24 కోట్లుగా ప్రభుత్వం నిర్ధేశించగా జూలైలో 4 కోట్ల 40 లక్షలు చేపనారు ఉత్పత్తి పూర్తి చేశారు. రాహు, కట్ల, మ్రిగాలా, కామన్ రకాలు పిల్లలు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసిన చేపనారు పిల్లలను కొవ్వలి, ఏలూరు, తణకు, కర్నూలు, గాజుల దిన్నె, మోటూరు, తదితర ప్రభుత్వ ఫారాలకు సరఫరా చేశారు. ఫారంలో ఒక ఫీల్ట్‌మేన్, ఒక ఫిషర్‌మేన్, ఇద్దరు కూలీలు పనిచేస్తున్నారు. రెండు అంగుళాలు ఉన్న చేపపిల్లలు ఫింగర్ లింగ్సు టార్గెట్ ఒక కోటిగా ఉంది. 90 లక్షలు ఇప్పటికే నిల్వ చేసి ఉంచారు.
చైనీస్ విధానంలోనే ఉత్పత్తి
చేపనారు ఉత్పత్తి చైనీస్ హేచరీస్‌లోనే ఉత్పత్తి చేయడం జరుగుతోంది. మేలుజాతి తల్లిచేపలను ముందుగానే సేకరించి చెరువుల్లో పెంచుతారు. వాటిలో ముందురోజు సాయంత్రం తల్లి చేపలు మగ, ఆడకు ఓవ సీస్ (తల్లి చేపలకు హర్మోన్) ఇంజక్షన్ ఇస్తారు. ఆ రెండు చేపలు సంయోగ పక్రియ ద్వారా గుడ్లును విడుదల చేస్తాయి. ఈరెండు బాహ్యఫలదీకరణ చెందిన గుడ్డు ఏర్పడుతాయి. ఇవి నీటిని షోచించుకుని ఉబ్బి ఉదయానికి గుడ్లు మధ్యలో స్పష్టమైన కేంద్రకుము ఏర్పడుతుంది. ఈ గుడ్లు తరువాత సమవిభజనతో అబివృద్ధి చెంది వివిధ దశలగా రూపాంతరం చెందుతూ స్పాన్‌గా తయారవుతుంది. బ్రీడింగును సాయంత్రం వేళలో నిర్వహిస్తారు. తరువాత రోజు ఉదయానికి గుడ్లు ఏర్పడతాయి. ఈ గుడ్లు మరుసటి రోజు సాయంత్రానికి ఒక వయస్సు కలిగిన స్పాన్‌గా ఉత్పత్తి అవుతాయి. ఇలా అభివృద్ధి చెందిన స్పాన్ మరో రెండురోజులు హేచరీ నందు ఉంచడం జరుగుతుంది. మెత్తంగా మూడురోజులు కలిగిన స్పాన్‌ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 6 గంటల సమయంలో చైనీస్ హేచరీలో వేస్తారు. ఇలాచేపనారు ఉత్పత్తిచేసి ప్రభుత్వ ఫారాలకు సరఫరా చేస్తారు.
రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచింది
రాష్ట్రంలోనే పేరు గాంచిన ఈ చేపల ఉత్పత్తి కేంద్రానికి అనుబంధంగా శిక్షణా కళాశాల నడుస్తోంది. ఇందులో మూడు నెలలు కోర్సు ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ చదువుకున్న వారికి ఫిషర్‌మేన్ ఇతర ప్రభుత్వ ప్రైవేట్ ఫారాల్లో పోస్టులు కూడా చేస్తున్నారు. అందువల్ల ఈశిక్షణా కేంద్రానికి ఉమ్మడి రాష్ట్రంలోనే పేరుంది. కాగా బాదంపూడి మత్య్స కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ క్షేత్రంలో నూతన భవనాలు లేకపోవడంతో తల్లి చేపలు పెంచడంలేదు. సమయానికి కొనుగోలు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. తగినంతమంది సిబ్బంది లేకపోవడం, జిల్లా, రాష్ట్ర స్థాయి మత్స్య శాఖ అధికారుల పర్యవేక్షణా లోపం కూడా ఇక్కడ ఉంది.
ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యం 24 కోట్లు
ఇప్పటివరకు 4.40 కోట్ల ఉత్పత్తి పూర్తి
ఉత్పత్తి చేసిన చేపనారు ప్రభుత్వ ఫారాలకు సరఫరా

జోరుగా చేపనారు ఉత్పత్తి

జోరుగా చేపనారు ఉత్పత్తి

జోరుగా చేపనారు ఉత్పత్తి