
సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్‌కు సత్కారం
ఏలూరు (మెట్రో): బదిలీపై వెళుతున్న నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్‌రాజ్‌ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఘనంగా సత్కరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం రెవెన్యూ అధికారుల సమావేశం అనంతరం నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్‌రాజ్‌ను దుశ్శాలువ, మెమొంటోతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, ఎస్డీసీ భాస్కర్, సర్వే శాఖ ఏడీ అన్సారీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్‌లు చల్లన్న దొర, విజయ్‌కుమార్‌రాజు, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.