
కొండరెడ్డి విద్యార్థిని మృతి
బుట్టాయగూడెం: మండలంలోని పులిరామన్నగూడెం పీహెచ్‌సీలో ఒక కొండరెడ్డి గిరిజన బాలిక బుధవారం మృతి చెందింది. పోలవరం మండలం దారావాడకు చెందిన బాలిక తల్లిదండ్రులు గురుగుంట్ల సింహాద్రిరెడ్డి, రామలక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురుగుంట్ల పూర్ణ(6) చిలకలూరులో 1వ తరగతి చదువుతుండగా, బుధవారం కన్నాపురంలో తన తమ్ముడితోపాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు వేలిముద్ర వేయాలని ఒక ట్రాక్టర్‌లో దారావాడ నుంచి కన్నాపురం వచ్చారు. వేలిముద్ర వేసే సమయంలో పూర్ణ కళ్లుతిరిగి పడిపోయింది. హుటాహుటిన బాలికను పులిరామన్నగూడెం పీహెచ్‌సీలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అంతకు ముందు కొండదిగే సమయంలో కూడా చింతపల్లి వద్ద ఉన్న చిలకలగండి సమీపంలో పూర్ణకు ఫిట్స్‌లా వచ్చాయి. కొద్దిసేపటికి బాగానే ఉండడంతో కన్నాపురం వెళ్లగా అక్కడ వేలిముద్ర వేస్తున్న సమయంలో ఫిట్స్‌తో పడిపోయింది. ఆస్పత్రిలో చేరిన బాలిక పూర్ణ మృతి చెందింది. బాలికకు ప్రాథనిక వైద్యంతోపాటు సీపీఆర్ కూడా చేసినా ఫలితం లేకుండా పోయిందని డాక్టర్ ఆకాంక్ష తెలిపారు. పూర్ణ మృతదేహాన్ని పీఆర్‌గూడెం నుంచి గడ్డపల్లి వరకూ మొబైల్ అంబులెన్స్‌లో తరలించారు. గడ్డపల్లి నుంచి దారావాడ వరకూ రహదారి అధ్వానంగా ఉండడంతో మొబైల్ అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో గిరిజనులే జోలి కట్టి మోసుకుంటూ దారావాడకు తీసుకువెళ్లారు. బాలిక గురుగుంట్ల పూర్ణ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

కొండరెడ్డి విద్యార్థిని మృతి