సీతంపేట వద్ద లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

సీతంపేట వద్ద లారీ బోల్తా

Aug 7 2025 8:06 AM | Updated on Aug 7 2025 9:14 AM

సీతంప

సీతంపేట వద్ద లారీ బోల్తా

కొయ్యలగూడెం : సీతంపేట సబ్‌ స్టేషన్‌ సమీపంలో జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రాజమండ్రి వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌ వైపు పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రోడ్డు పక్కనే ఉన్న చెత్తకి నిప్పు పెట్టడం వల్ల రోడ్డుపై భారీగా పొగ అలుముకోవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆట్యా పాట్యా జిల్లా జట్ల ఎంపిక

భీమవరం: పట్టణంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం స్కూల్లో బుధవారం ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపిక జరిగింది. క్రీడాకారులు పి గోపీకృష్ణ, డి మోహన్‌కుమార్‌, జి యశ్వంత్‌రమణ, కె సాయిధనుష్‌, జె అభిషేక్‌పాల్‌, వి జయసంతోష్‌, పి రోహిత్‌ కుమార్‌, వి మణికంఠ గణేష్‌, ఎం తేజమహిమ, ఎం అభిరామ్‌, బి వెంకన్న, పి ప్రేమ్‌కుమార్‌, పి భాస్కరతేజ జిల్లా జట్లకు ఎంపికయ్యారని ఆట్యాపాట్యా జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి కిరణ్‌వర్మ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9వ తేదీ నుంచి ఒంగోలులో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు.

వైభవం.. శోభనాచలుడి పవిత్రోత్సవం

ఆగిరిపల్లి: స్థానిక శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి వైభవంగా పవిత్రములు సమర్పించారు ఉదయం స్వామివారికి స్నపన, ప్రత్యేక అలంకరణ, శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన మూలా మంత్ర హోమం, దిగువ సన్నిధిలో ఉన్న స్వామివారికి పవిత్రములు సమర్పణ, నవ కుంభారాధన, శాంతి హోమం ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వణాధికారి సాయి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌ వ్యవహారంపై విచారణ

కుక్కునూరు: నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌ వ్యవహారంపై భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం సారాపాక గ్రామానికి చెందిన భూక్యా శ్రీరాములు పేరిట ఓ ఎల్‌ఐసీ ఏజెంట్‌ రూ.10 లక్షల పాలసీకి ఏడేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఆ వ్యక్తి బతికుండగానే మరణించినట్లుగా కుక్కునూరు పంచాయతీ నుంచి డెత్‌ సర్టిఫికెట్‌ పోంది ఎల్‌ఐసీ నుంచి రూ.10 లక్షలు క్లయిమ్‌ చేశాడు. ఈ విషయాన్ని గత ఫిబ్రవరి 10వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక బహిర్గతం చేసింది. కాగా ఈ వ్యవహారంలో డబ్బును రికవరీ చేసిన ఎల్‌ఐసీ కార్యాలయ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. కుక్కునూరులో నకిలీ సర్టిఫికెట్‌ ఎవరు ఇచ్చారన్న విషయమై గత నాలుగు రోజులుగా కొందరిని స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

సీతంపేట వద్ద లారీ బోల్తా 1
1/2

సీతంపేట వద్ద లారీ బోల్తా

సీతంపేట వద్ద లారీ బోల్తా 2
2/2

సీతంపేట వద్ద లారీ బోల్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement