
ఆకట్టుకున్న నిమ్మకాయల అలంకరణ
గ్రంథాలయానికి సామగ్రి అందజేత
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయానికి బెంగళూరుకు చెందిన శివశ్రీ చారిటబుల్ ట్రస్ట్, శిక్షణ ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం కంప్యూటర్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్లను అందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో ఎంపిక చేసిన 16 శాఖా గ్రంథాలయాలకు 2 కంప్యూటర్స్, ఒక స్మార్ట్ టీవీ, ఒక స్మార్ట్ ఫోన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబుకు డిస్టిక్ మాస్టర్ ట్రైనర్ డి.సత్యనారాయణ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ సిబ్బంది జి.బుజ్జిబాబు, ఐ.రాజారావు, జి.కార్తీక్ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నిమ్మకాయల అలంకరణ