
మళ్లీ పెరిగిన గోదావరి
వేలేరుపాడు: ఎడతెరపి లేని వర్షాలకు వాగు లు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచ లం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగు తోంది. గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35.40 అడుగులకు నీటిమట్టం చేరింది. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే దారిలోని ఎద్దెలవాగు వంతెన ఉదయమే నీటమునిగింది. దీంతో దిగువన ఉన్న 18 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొయిదా, కట్కూరు, కాచారం, తాళ్ల గొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, ఎడవల్లి, బుర్రెడ్డిగుడెం, టేకూరు, సిద్దారం, కుంకుడు కొయ్యలపాకలు మరో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు తహసీల్దార్ సత్యనారాయణ ఎద్దెలవాగు వద్ద నాటు పడవను ఏర్పాటుచేశారు.
5.53 లక్షల క్యూసెక్కులు దిగువకు..
పోలవరం రూరల్: పోలవరం వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. ప్రాజెక్టు దిగువన స్పిల్‌వే వద్ద 30.400 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 5.53 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన వరద ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాలతో మరో రెండు రోజుల పాటు వరద పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

మళ్లీ పెరిగిన గోదావరి