
సంక్షామ హాస్టళ్లు
పెచ్చులూడిన శ్లాబ్‌లు.. ఎండైనా, వానైనా నేలపైనే నిద్ర.. డోర్లు లేని బాత్‌రూమ్‌లు.. గదుల్లో తిరగని ఫ్యాన్లు.. ఎటుచూసినా క్షీణించిన పారిశుద్ధ్యం.. ఇది జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల దుస్థితి. రెండు దుప్పట్లు, ప్లేటు, గ్లాసు మాత్రమే విద్యార్థులకు అందిస్తున్నారు. హాస్టళ్లు కారాగారాలను తలపిస్తున్నాయని, మీ ఇంట్లో పిల్లలను నేలపైనే పడుకోపెడతారా, ఎన్‌సీపీసీఆర్ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదంటూ హైకోర్టు సీరియస్ అయినా, అప్పుడప్పుడు న్యాయమూర్తులు, న్యాయ విభాగాధికారులు తనిఖీలు చేసినా పరిస్థితుల్లో ఏ మార్పులు లేవు. పైగా రోజురోజుకూ సమస్యలు తీవ్రతరమవుతున్నాయి.
ఆదివారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 59 బాలురు, బాలికల వసతి గృహా లు, 38 బీసీ బాలబాలికల వసతి గృహాలు, అలాగే 6 ఎస్టీ బాలబాలికల వసతి గృహాలు ఉన్నాయి. మొత్తంగా 103 హాస్టళ్లలో 16,400 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. 3వ తరగతి నుంచి పోస్టు మెట్రిక్ వరకు వసతి గృహాలు జిల్లాలో ఉన్నాయి. అయితే అత్యధిక శాతం వసతి గృహాలు ప్రభుత్వ భవనాలు, జంగారెడ్డిగూడెంతో పాటు మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. 3, 4 తరగతి విద్యార్థులకు డైట్ ఛార్జీల పేరుతో రూ.1,150, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,400, కాస్మోటిక్ చార్జీల కింద నెలకు ఎగువ తరగతి విద్యార్థులకు రూ.200, దిగువ తరగతి విద్యార్థులకు రూ.150 ఇచ్చేవారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం కాస్మోటిక్ కిట్లను కొనుగోలు చేసి ఇవ్వాలనే పేరుతో కాస్మోటిక్ చార్జీలకు ఎగనామం పెట్టింది. డైట్ చార్జీల చెల్లింపులు ఉన్నప్పటికీ అత్యంత నాసిరకం భోజనం తప్ప పౌష్టికాహా రం అందని పరిస్థితి. వీటితో పాటు బాత్‌రూమ్ లకు తలుపులు లేకపోవడం, అలాగే ఆర్‌ఓ ప్లాంట్లు మరమ్మతులు నోచుకోక, పలుచోట్ల తిరగని ఫ్యాన్లతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
సమస్యలు కోకోల్లలు
● ఏలూరు శాంతినగర్ బీసీ బాలుర హాస్టల్‌లో ఫ్యాన్లు మరమ్మతులు చేయకపోవడం, బాత్‌రూ మ్‌లకు తలుపుల లేకపోవడంతో విద్యార్థులు ఇ బ్బంది పడుతున్నారు. తాగునీరు బయట నుంచి కొనుగోలు చేసి తీసుకురావాల్సిన పరిస్థితి. ●
● చింతలపూడి నియోజకవర్గంలో 8 ఎస్సీ హాస్టళ్లు, 3 బీసీ హాస్టళ్లు, ఒక ఎస్టీ హాస్టల్‌లో కలిపి మొత్తం 1,700 మంది విద్యార్థులు ఉన్నారు. వర్షం పడినా, చలికాలం వచ్చినా చలికి వణుకుతూ వీరు పడుకోవాల్సిందే. మంచాలు, కనీసం చాపలు కూడా లేని పరిస్థితి. ఇక మరుగుదొడ్లు మొదలు పరిసరాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించింది.
● జంగారెడ్డిగూడెంలో 29 మంది విద్యార్థులుండే బీసీ హాస్టల్‌లో విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు. కామవరపుకోటలో పాత భవనాల్లోనే నెలకు రూ.19 వేల అద్దెతో ఎస్సీ, బీసీ వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. వర్షం వస్తే విద్యార్థులకు అగచాట్లే. తలుపులు, కిటికీలు లేకపోవడం చలి గాలులతో ఇబ్బంది పడుతున్నారు.
● దెందులూరు నియోజకవర్గంలోని శింగవరంలో ఎస్సీ బాలికల హాస్టల్‌లో 65 మంది విద్యార్థులు న్నారు. శిథిలావస్థకు చేరిన భవనం తరుచూ పె చ్చులూడుతుండటంతో నిత్యం ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి.
● నూజివీడులో ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో విద్యా ర్థులకు దుప్పట్లు ఇవ్వకపోవడంతో 45 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. నూజివీడులో ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహంలో 9 మంది సిబ్బందికి నలుగురే పనిచేస్తుండటం, 220 మంది ఉన్న వసతి గృహాన్ని ఇద్దరు వార్డెన్లే అరకొర సౌకర్యాల నడుమ నిర్వహిస్తున్నారు.
● పోలవరం నియోజకవర్గంలోని కేఆర్‌పురంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉన్న ఎస్టీ బాలుర వసతి గృహం నిర్మించి 52 ఏళ్లు అయ్యింది. భవనం పూర్తిగా పెచ్చులూడి తరుచూ విద్యార్థులపై పడుతున్నా అధికారుల స్పందన శూన్యం. రూ.2.57 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కనీసం తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడంతో వి ద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. మరుగు దొడ్లు అధ్వానంగా ఉండటంతో పాటు గుమ్మాలు, కిటికీలు పూర్తిగా పాడైపోయాయి.
● భీమడోలు మండలంలో వసతి గృహాల్లో విద్యార్థులు భయంగా గడుపుతున్నారు. కొన్నేళ్ల క్రితం గుండు గొలనులో హాస్టల్ కూలినప్పటి నుంచి 72 మంది విద్యార్థులు హైస్కూల్‌కు మకాం మార్చారు. చేబ్రోలులోని వసతి గృహం గోడలు బీటలు వారి శిథిలావస్థకు చేరింది. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా దుప్పట్లు, కాస్మోటిక్స్, నోటు పుస్తకాలు ఇవ్వని పరిస్థితి.
న్యూస్‌రీల్
వసతి.. అధోగతి
భవనాలకు పెచ్చులూడిన శ్లాబ్‌లు
నేలపైనే విద్యార్థుల నిద్ర
తాగునీటికి కొరత.. అధ్వానంగా మరుగుదొడ్లు
సమస్యల వలయంలో వసతి గృహాలు
హైకోర్టు మందలించినా మారని అధికారుల తీరు
జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్ల దుస్థితి
జిల్లాలో హాస్టళ్లు
సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 59
బీసీ హాస్టళ్లు 38
ఎస్టీ హాస్టళ్లు 6
మొత్తం విద్యార్థులు 16,400

సంక్షామ హాస్టళ్లు

సంక్షామ హాస్టళ్లు

సంక్షామ హాస్టళ్లు

సంక్షామ హాస్టళ్లు

సంక్షామ హాస్టళ్లు

సంక్షామ హాస్టళ్లు