
గళమెత్తిన ఉపాధ్యాయులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేశారు. జిల్లా అధ్యక్షుడు షేక్ ముస్తఫా అలీ, రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ మాట్లాడుతూ బదిలీ అయిన టీచర్లకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, కేడర్ అప్‌డేట్ చేయలేదని, ఉపాధ్యా యులకు బోధనేతర పనులు అప్పగించరాదని, పలు శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయులను బో ధనకు దూరం చేస్తున్నారని గళమెత్తారు. వెంటనే ఉపాధ్యాయులకు జీతాలు వచ్చేలా చూడాలని లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.