
సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం
ఏలూరు (టూటౌన్): వయోజనులందరినీ అక్ష రాస్యులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యత కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని డీఆర్‌డీఏ పీడీ ఆర్. విజయరాజు అన్నారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం వట్లూరు టీటీడీసీలో జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో మొదటి విడతగా 97,200 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూ పొందించాలన్నారు. కో–ఆర్డినేటర్, జిల్లా వ యోజన విద్య నోడల్ అధికారి కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గతేడాది తీసుకున్న చర్యలతో జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నా రు. జెడ్పీ సీఈఓ భీమేశ్వరరావు, డ్వామా ఏపీ డీ రాజశేఖర్, డీఎల్‌పీఓ, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
1 నుంచి ఆటో మ్యూటేషన్
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని నగరపాలక సంస్థల్లో వచ్చేనెల 1 నుంచి ఆస్తి పన్నుల ఆటో మ్యూటేషన్ నిర్వహించనున్నట్టు ఏలూరు కమిషనర్ ఎ.భానుప్రతాప్ తెలిపారు. స్థానిక కా ర్పొరేషన్ కార్యాలయంలో శనివారం సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆటో మ్యూటేషన్‌తో ఆస్తి యజమానులకు సమయం ఆదా అవుతుందన్నారు. జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరా వు, కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ జి.చంద్ర య్య, డిప్యూటీ కమిషనర్ కె.శివారెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు మార్పులు
ఏలూరు(మెట్రో): జిల్లాలో పోలింగ్ స్టేషన్ల మార్పులు, అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం ఓటర్ల జాబితా సవరణ, పో లింగ్ కేంద్రాల మార్పు, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పోలింగ్ స్టేషన్ల మార్పు కోసం 16, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు 123 ప్రతిపాదనలు అందాయన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, రాజకీయపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.
స్కేటింగ్‌లో జెస్సీరాజ్ ప్రతిభ
దెందులూరు: జోగన్నపాలెంకు చెందిన స్కే టింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ మాత్రపు అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటింది. దక్షిణ కొరియాలో జరిగిన 20వ ఆసి యా రోలర్ స్కేటింగ్ సోలో డాన్స్ సబ్ జూనియర్ విభాగ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. ఆమెను, కోచ్ సింహాద్రిని భారత రోలర్ స్కేటింగ్ సమాఖ్య కార్యదర్శి భగీరథకుమార్, ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి థామస్ చౌదరి, ఆంధ్రప్రదేశ్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ స్కేటింగ్ చైర్మన్ పవన్‌కుమార్, శాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు అభినందించారు.
వెల్ఫేర్ బోర్డు కోసం ధర్నాలు
ఏలూరు (టూటౌన్): భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని, పా త క్లయిమ్‌లు పరిష్కరించాలంటూ ఈనెల 28న తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ డాంగే, ఏపీ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ చేపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో శనివారం భవన నిర్మాణ కా ర్మికుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎ న్నికలకు ముందు తెలుగుదేశం కూటమి నా యకులు తాము అధికారంలోకి వస్తే బిల్డింగ్ వెల్ఫేర్ ఫండ్ బోర్డును పునరుద్ధరిస్తామని, మ రిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా హామీలను అమలు చేయలేదన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
నేడు ఎయిడెడ్ టీచర్ నియామక పరీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి, కోట్ల వెంకట రామయ్య బాలికోన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న 7 ఎయిడెడ్ టీచర్ పోస్టులకు ఆదివారం ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్ష జరుగనుంది. భీమవరం డీఎన్నార్ కాలేజీ అ టానమస్, డీఎన్నార్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్, భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్, తా డేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్, తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు.