
కనిపిస్తే సమాచారం ఇవ్వండి
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో గిరినాగులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి. ప్రాణభయంతో పాములను చంపవద్దు. మాకు సమాచారం ఇస్తే వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తాం. ఈ పాములు అరుదైనవి. అభయారణ్యంలో వణ్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– ఎస్‌కే వల్లీ, రేంజ్ అధికారి, పోలవరం
20 అడుగుల పొడవు
గిరినాగు పాము చాలా ప్రమాదమైంది. 20 అడుగుల పైగా పొడవు ఉంటుంది. బాగా ముదిరిన పాము చాలా డేంజర్. నేను చాలాసార్లు వాటిని చూశాను. అటవీ ప్రాంతంలో పర్యటించినప్పుడు అవి కనిపిస్తే పరుగులు తీసేవాళ్లం.
– ఎస్.ప్రసాద్, బుట్టాయగూడెం
అత్యంత ప్రమాదకరం
గిరినాగులు అత్యంత ప్రమాదకరం. వీటిని పట్టుకోవడం అంత సులువు కాదు. పాపికొండలు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నట్టు ఫోన్‌లు వస్తున్నాయి. గిరినాగు కనిపిస్తే ఎవరూ చంపవద్దు. 8099855153 నంబర్‌కు ఫోన్ చేస్తే నేను వచ్చి పట్టుకుని వాటిని అడవిలో వదిలేస్తా.
– చదలవాడ క్రాంతి, స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు, జంగారెడ్డిగూడెం
మనుషులపై దాడి చేయవు
గిరినాగులు సాధారణంగా మనుషులపై దాడి చేయవు. అయితే వాటిని భయపెట్టడం లేదా రెచ్చగొట్టడం చేస్తే కాటు వేస్తాయి. ఇది చాలా విషపూరితమైన పాము. కాటు వేస్తే మరణమే తప్ప జీవించే అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
– గంధం విక్టర్, బుట్టాయగూడెం
●

కనిపిస్తే సమాచారం ఇవ్వండి

కనిపిస్తే సమాచారం ఇవ్వండి

కనిపిస్తే సమాచారం ఇవ్వండి