
ట్రైతలాన్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
తణుకు అర్బన్ : జిల్లా ట్రైతలాన్ (రన్నింగ్, స్విమ్మింగ్, షూటింగ్) పోటీల్లో మండలంలోని మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.ఫణిశ్రీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. ఈనెల 24వ తేదీన తేతలిలోని స్టెప్పింగ్ స్టోన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన అండర్ 17 విభాగంలో ఎస్.గణేష్, అండర్ 15 విభాగంలో కె.కిరణ్, ఎస్.రోహిత్, జి.రమేష్, అండర్ 13 విభాగంలో జి.ఆనంద్ శ్రీనివాస్ ప్రతిభ చూపారని వివరించారు. వీరు ఈ నెల 26, 27 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ట్రైతలాన్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను పలువురు అభినందించారు.