
వైరల్ జ్వరాలపై అప్రమత్తత అవసరం
ఏలూరు (టూటౌన్): జిల్లాలో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి విష జ్వరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పీజే అమృతం విజ్ఞప్తి చేశారు. స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. డెంగీ నిర్ధారణ పరీక్షలు ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గర్భిణులు జ్వరం వచ్చినప్పుడు వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని స్పష్టం చేశారు.

వైరల్ జ్వరాలపై అప్రమత్తత అవసరం