పకడ్బందీగా మార్గదర్శకాలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా మార్గదర్శకాలు అమలు చేయాలి

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌, ఇతర ఉన్నతాధికారులు స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో మంగళవారం సమీక్షించారు. దీనిలో భాగంగా కలెక్టర్‌ కీర్తి చేకూరి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ నుంచి పాల్గొని, జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాల్లో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియను జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘ స్వరూప్‌ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

రిజర్వేషన్ల ప్రక్రియలో నిబంధనలు పాటించాలి

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో నిబంధనలు, విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ శుభం నొఖ్వాల్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో డివిజనల్‌ స్థాయి అభివృద్ధి అధికారి (డీడీఓ), రాజమహేంద్రవరం డివిజన్‌ పరిధిలోని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులతో(ఎంపీడీఓలు) సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల ప్రక్రియలో అనుసరించాల్సిన ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను వివరించారు. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జితో ప్రమాద బీమా ఆఫర్‌

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): దసరా సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జి చేసుకున్న వారికి రూ.లక్ష ప్రమాద బీమా పథకాన్ని అందజేస్తున్నామని ఆ సంస్థ ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ పలివెల రాజు తెలిపారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ నెలవారీ రీచార్జి చేయించుకుంటే 32 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుందని, అంతే కాకుండా 32 రోజుల్లోపు ప్రమాదం జరిగితే పైన తెలిపిన బీమా కూడా అందుతుందన్నారు. ఖాతాదారుడి అక్కౌంట్‌ సైబర్‌ క్రైమ్‌కు గురైతే నిబంధనల ప్రకారం రూ.10 వేల సైబర్‌ బీమా వర్తిస్తాయన్నారు.

డిప్లొమో కోర్సుల దరఖాస్తులకు నేడే చివరి గడువు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026 – 27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారం (ఈ నెల 14)తో ముగుస్తుందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రాజు తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాల కార్యాలయంలో అందజేయాలన్నారు. కోర్సుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానాన్ని కళాశాల అధికారిక వెబ్‌సైట్‌ అయిన జీఎమ్‌సీరాజమహేంద్రవరం.ఏపీ.గవ్‌.ఇన్‌, అలాగే జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ అయి న ఈస్ట్‌గోదావరి.ఏపీ.గవ్‌.ఇన్‌లలోతెలుసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement