గ్రావెల్‌ లారీలతో పుంత రోడ్డు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ లారీలతో పుంత రోడ్డు ధ్వంసం

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

రంగంపేట: గ్రావెల్‌ లారీల రాకపోకలతో వెంకటాపురం గ్రామం నుంచి పెదరాయవరం వెళ్లే పుంత రహదారి రోడ్డు ధ్వంసమవుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎగసిపడుతున్న దుమ్ము, ధూళితో పంట పొలాలు, పశుగ్రాసం నాశనమవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రావెల్‌ లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే వ్యవసాయంలో పలు సమస్యలతో సతమతమవుతున్న తమకు గ్రావెల్‌ లారీల రాకపోకలు అదనపు భారంగా మారాయన్నారు. పుంత రహదారి దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్లు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. కాగా.. విషయం తెలుసుకున్న వీఆర్వో రామారావు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పుంత రహదారిపై గ్రావెల్‌ లారీల రాకపోకలను నిలిపివేసి, రహదారిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement