అధికార పార్టీ అండతో దౌర్జన్యాలు | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ అండతో దౌర్జన్యాలు

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

ఎమ్మెల్యే అండతోనే ఆగడాలు

అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అండదండలతోనే ఆయన అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణలో యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. వృద్ధ దంపతులకు రక్షణ కల్పించాలని, ఇంటి ధ్వంసం ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, అక్రమంగా కేసులు నమోదు చేశారనే ఆరోపణలపై సమగ్ర పరిశీలన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు.

ఫ జి.దొంతమూరులో వృద్ధుడి ఇంటిపై దాడి దారుణం

ఫ మాజీ ఎమ్మెల్యే

డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి

రంగంపేట: అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ అండదండలతో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట మండలం జి.దొంతమూరులో 85 ఏళ్ల ముత్యం రామచంద్రరావు ఇంటిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంటిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం బాధితులను పరామర్శించారు.

దాడి చేయడం దారుణం

ముత్యం రామచంద్రరావు ఇంటిపై తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులుగా పేర్కొంటున్న కొందరు దాడికి పాల్పడ్డారని డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. రామచంద్రరావుకు, కూటమి పార్టీలకు చెందిన దుర్గన పుల్లారావుకు మధ్య నెలకొన్న ఇంటి వివాదంలో బాధితుడు కోర్టులో విజయం సాధించినప్పటికీ, ఇంటి ప్రహరీతో పాటు పైకప్పును ధ్వంసం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి తీర్పు పొందినప్పటికీ బాధితులకు రక్షణ లేకపోవడం ఆందోళనకరమన్నారు. ఇంటిపై దాడి చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు బాధితులనే నిందితులుగా చూపడం సరికాదన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను డిశ్చార్జి చేయించి, వారి కుటుంబ సభ్యులకు సరైన సమాచారం ఇవ్వకుండానే పెద్దాపురం సబ్‌జైలుకు తరలించారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement