● పరిమళించిన మానమాత్వం | - | Sakshi
Sakshi News home page

● పరిమళించిన మానమాత్వం

Oct 4 2026 9:55 AM | Updated on Oct 4 2026 9:55 AM

● గూడుకట్టిన సోయగం

ప్రకృతి సోయగం కనువిందు చేసింది.. అందరినీ కట్టిపడేసింది.. రాజానగరం మండలం సంపత్‌నగరం గ్రామ శివాలయం వద్ద కోనేరు గట్టుపై ఉన్న తాటిచెట్లకు వేలాడుతున్న పిచ్చుక గూళ్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. గుడికి వచ్చే భక్తులతో పాటు ఆ దారి వెంబడి రాకపోకలు సాగించే ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో చాలామంది తమ సెల్‌ఫోన్లలో ‘క్లిక్‌’ మనిపించి, ఫొటోలను భద్రపరచుకుంటున్నారు. – రాజానగరం

ఈ ఘటన మానవత్వాన్ని చాటింది. తాడేపల్లిగూడేనికి చెందిన ఉంగరాల సత్యనారాయణ శనివారం ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం శ్రీవకుళమాత నిత్యాన్నదాన భవనానికి చేరుకున్నారు. అన్నదాన సిబ్బంది వడ్డిస్తున్నా.. రెండు చేతులూ లేని సత్యనారాయణ అన్నప్రసాదాన్ని ఎలా స్వీకరించాలో తెలియక చూస్తుండిపోయారు. ఆయన పరిస్థితిని గమనించిన అక్కడి మహిళా కార్మికురాలు దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా కన్నబిడ్డకు తినిపించినట్టుగా అన్నప్రసాదాన్ని అందించింది. ఈ ఘటన అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. – ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement