● ప్రశ్నిస్తున్న వారిని బెదిరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం
● వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకులను అక్రమ కేసులతో బెదిరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగ రం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో సోమ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులపై ఎన్నో అక్రమ కేసులు బనాయించి, జైళ్లకు పంపిస్తు న్నారని అన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, కారుమూరి సునీల్, అంబటి రాంబాబు, జోగి రమేష్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి నేతల అక్రమ అరెస్టులే దీనికి ఉదాహరణలని చెప్పా రు. పార్టీ యువజన విభాగం కర్నూలు పట్టణ అధ్యక్షు డు బాలును కొట్టి, భయపెట్టి, అక్రమ కేసులు పెట్టారని, దీనిపై ప్రశ్నిస్తే తనపై కూడా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. రంగంపేటలో వైఎస్సార్ సీపీ నా యకులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని ప్రశ్నిస్తే కేసు నమోదు చేశారని చెప్పారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని రాజా స్పష్టం చేశా రు. తన తండ్రి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పోరాడితే 65 కేసులు పెట్టారని గుర్తు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన తల్లి విజయలక్ష్మి పోరాడితే కేసులు బనాయించి, జైలుకు పంపారన్నారు. ఎన్నో ఉద్యమాలు చేపట్టిన తన తల్లిదండ్రుల స్ఫూర్తితో.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో యువత ఉద్యమానికి తల వంచిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించిందని రాజా అన్నారు. ఇదే ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి చెందిన లోకేష్ కూడా డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నేడు జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు
డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగులు, విద్యార్థుల సమ స్యలపై వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మంగళవా రం నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నామని రాజా చెప్పా రు. కూటమి ప్రభుత్వంపై నిర్వహిస్తున్న ఈ పోరులో నిరుద్యోగులు, యువకులు, డీఎస్సీ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని రాజా కోరారు. నిరసన ర్యాలీలు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రభుత్వం కొద్ది మొత్తంలో నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంటోందన్నారు.


