సఖినేటిపల్లి: గోదావరిలో దొరికే పులస చేపలకు ఎంత డిమాండ్ ఉంటుందో.. సముద్రంలో అరుదుగా లభ్యమ య్యే కచిడి చేపలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటోంది. ఇందులో ఆడ చేప కన్నా, మగ చేపకు డిమాండ్ ఎక్కువ. మగ చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని చెబుతారు. పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారులకు శనివారం మూడు మీడియం సైజులో కచిడి చేపలు చిక్కాయి. వీటిని హార్బర్‌లో కొనుగోలుదారుడు రూ.1.35 లక్షలకు దక్కించుకున్నాడు. కచిడి చేపను గోల్డెన్ ఫిష్‌గా కూడా పిలుస్తారు.


