చెట్లు తొలగించకుంటే గట్టుకు ముప్పే | - | Sakshi
Sakshi News home page

చెట్లు తొలగించకుంటే గట్టుకు ముప్పే

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

అడ్డతీగల: మద్దిగడ్డ జలాశయం ఎడమ గట్టుపై మొలిచిన పిచ్చి మొక్కలు ప్రస్తుతం చెట్లుగా మారి అడవిని తలపిస్తున్నాయి. వాటిని తొలగించకుంటే ఎడమ గట్టుకు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. జలాశయం ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవెల్‌ 188 మీటర్లు కాగా, ప్రస్తుతం 179 మీటర్ల నీటి మట్టం ఉంది.

అడపాదడపా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో ఎగువ ప్రాంతంలో వర్షాలు అధికంగా పడితే జలాశయం నిండిపోతుంది. అసలే ఎడమ గట్టు ప్రాంతంలో కొన్నాళ్లుగా లీకేజీలు ఉన్నా అధికారులు సరి చేయడం లేదు. వృక్షాలతో గట్టు బలహీన పడిన నేపథ్యంలో దురదృష్టవశాత్తూ గట్టుకు గండి పడితే నాలుగు ఎకరాల ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకమవుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement