ప్రవేశ పరీక్షలో శ్రీప్రకాష్‌ విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ప్రవేశ పరీక్షలో శ్రీప్రకాష్‌ విద్యార్థి ప్రతిభ

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

తుని: ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ప్రవేశ పరీక్షలో శ్రీ ప్రకాష్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థి జె.మోనిష్‌ కుమార్‌ ఆల్‌ ఇండియా లెవెల్‌ ఓబీసీ క్యాటగిరీలో 15వ ర్యాంక్‌, ఓపెన్‌ క్యాటగిరిలో 107 ర్యాంక్‌ సాధించాడు. ప్రిన్సిపాల్‌ వీవీఎస్‌ఎస్‌ భానుమూర్తి మంగళవారం ఈ విషయం తెలిపారు. తమ విద్యాసంస్థలో 6 నుంచి 12వ తరగతి వరకు ఇస్తున్న ఏడేళ్ల క్లాస్‌ రూం ప్రోగ్రాంతో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణతో విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారన్నారు. ప్రతిభ చూపిన జె.మోనిష్‌ కుమార్‌ను విద్యా సంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ ప్రకాష్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement