ఉప్పలగుప్తం: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే నెల 15న తలపెట్టిన మంత్రి నారా లోకేష్ ఇంటికి చేసే పాదయాత్రను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఫెడరేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎన్.గంగాధరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, హెచ్‌ఆర్‌సీ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వేతనాలు పెంచాలని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ గ్రాట్యూటీ అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని సభ్యులు డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారానికి తలపెట్టిన పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. జిల్లా జేఏసీ ఉపాధ్యక్షుడు బి.జాన్‌బాబు, జిల్లా పార్ట్ టైం ఉద్యోగుల కోశాధికారి ఎం.అశోక్‌బాబు, మండల సీఆర్‌ఎంటీ నాయకులు పండు మురళీకృష్ణ, అయితాబత్తుల శ్రీనివాసరావు, ఎం.లలిత, కేడీ భవాని, కె.శ్రీనివాసరావు, వి.వనజాక్షి, ఎ.నాగలక్ష్మి, ఎన్.వెంకట్రావు, జి.మంగాదేవి, మట్టపర్తి అన్నపూర్ణ, సీహెచ్ దుర్గారావు, కె.సత్తిబాబు, పి.నాగేశ్వరరావు, ఎం.లవకుమార్, ఎన్.ఈశ్వర వెంకటప్రసాద్, వి.విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


